University Of Hyderabad: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 76 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్/ సెమినార్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 30
* ఫ్యాకల్టీ పోస్టులు
ప్రొఫెసర్లు: 14 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్లు: 11 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 05 పోస్టులు
స్ట్రీమ్:
⏩ సైన్సెస్ సబ్జెక్టులు..
➔ మాథెమాటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
➔ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్
➔ ఫిజిక్స్
➔ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ
➔ కెమిస్ట్రీ
➔ బయోకెమిస్ట్రీ
➔ మెడికల్ సైన్సెస్
➔న్యూరల్ & కాగ్నిటివ్ సైన్సెస్
⏩ హ్యుమానిటీస్
➔ ఫిలాసఫీ
➔ హిందీ
➔ ఉర్దూ
➔ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్
➔ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ సబ్జెక్టులు
⏩ ఎకనామిక్స్ సబ్జెక్టులు
➔ ఎకనామిక్స్
⏩ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులు
➔ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ
⏩ ఆర్ట్స్ &కమ్యూనికేషన్ సబ్జెక్టులు
➔ డాన్స్
➔ థియేటర్ ఆర్ట్స్
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: యూఆర్, ఓబీసీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.1000. ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థి అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ, డెమాన్‌స్ట్రేషన్/ సెమినార్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.
హార్డు కాపీలు పంపాల్సిన చిరునామా:
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.O.,
GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA.x
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25.01.2024.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ:31.01.2024.
Notification
ALSO READ:
ఒంగోలు జీజీహెచ్‌లో 298 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల- ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 298 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.