TSPSC Group 1 Recruitment 2022 Applications: సీఎం కేసీఆర్ మొత్తం 80 వేల పోస్టులను భర్తీ చేస్తామని మార్చి నెలలో అసెంబ్లీలో ప్రకటించారు. దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల అయింది. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందే పోలీస్ ఉద్యోగాలకు నోటిపికేషన్ వచ్చింది. రేపటి (మే 2వ తేదీ) నుంచి గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తుది గడువు మే 31తో ముగియనుంది. పోలీస్, ఇతర యూనిఫామ్ పోస్టులకు మే 2 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తెలంగాణలో నోటిఫికేషన్ల జాతరలో భాగంగా మొదట పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తరువాత తాజాగా గ్రూప్ 1 పోస్టుల (TS Group-I Notification) భర్తీలో భాగంగా నోటిఫికేషన్ జారీ అయింది.
మొత్తం 19 రకాల పోస్టులు..
తెలంగాణ గ్రూప్-1లో 19 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే అభ్యర్తులు ముందుగా ఓటీఆర్‌లో సవరణలు చేసుకుని, కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఇంటర్వ్యూ రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహణతో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, గ్రూప్-1 మెయిన్స్‌కు ఒక్కో పోస్టుకుగానూ 50 మందిని ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌లో 900 మార్కులు రాత పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు విధానం ఇదే..
అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను సందర్శించండి
మీరు ఇదివరకు రిజిస్టర్ కానీ వారైతే న్యూ రిజిస్ట్రేషన్ (OTR)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకోసం మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. వివరాలు నింపి సబ్మిట్ చేయాలి
మీరు గతంలో రిజిస్టర్ అయిన వారైతే ఎడిట్ ఓటీఆర్ (Candidate Login) మీద క్లిక్ చేసి వివరాలు అప్‌డేట్, ఎడిట్ చేసుకోవాలి.
ఓటీఆర్ వివరాలతో పాటు
అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టీ వ్యాలెట్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించిన తరువాత అప్లికేషన్ పేజీని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవాలి.
గ్రూప్ -1లో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..
జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు - 5
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు -38
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పోస్టులు - 20
డీఎస్పీ పోస్టులు - 91
జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు - 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టులు - 8
జిల్లా ఉపాధి అధికారి పోస్టులు - 2
జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు - 6
గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు - 35
మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టులు - 121
జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు - 5
సీటీఓ పోస్టులు - 48
డిప్యూటీ కలెక్టర్లు పోస్టులు - 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు - 26
ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు - 4
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు - 2
మే 2 నుంచి పోలీస్ జాబ్స్‌కు దరఖాస్తులు..
పోలీస్, ఫైర్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, రవాణా శాఖల్లోని ఖాళీ భర్తీకి ఇటీవల నోటిఫికేసన్లు విడుదలయ్యాయి. మే 2 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) తెలిపింది. పోలీస్ పోస్టులకు మే 2 న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, మే 20 రాత్రి తుది గడువు ముగియనుందని బోర్డ్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Also Read: TS Govt Jobs Process : గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, ఉద్యోగాల భర్తీ, పరీక్షా విధానాలపై ఉత్తర్వులు
Also Read: TS Group-I Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల