తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలతోపాటు తుది రాత పరీక్ష ఫైనల్ 'కీ' ని కూడా అందుబాటులోకి వచ్చింది. తుది పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను మే 30న సాయంత్రమే ప్రకటించిన పోలీసు నియామక మండలి కొద్ది గంటల్లోనే ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ మొబైల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి చూసుకోవచ్చు.


ఎస్‌ఐ, కానిస్టేబుల్ మార్కుల వివరాలు, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


తుది ఫలితాల్లో ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 (90.90 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 (75.56 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 (74.84 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 (23.40 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 (89.53 శాతం), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 (77.54 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 (79.97 శాతం), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 (82.07 శాతం) మంది అర్హ‌త సాధించారు.


రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం..
కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫలితాలకు సంబంధించి అభ్యర్థులకు రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.2,000, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ.3,000 చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ ప్రక్రియ జూన్ 1న ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.


వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష రెస్పాన్స్ (ఓఎంఆర్) షీట్లను మే 30న రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థుల స్కానింగ్ ఓఎంఆర్ షీట్లతోపాటు, పరీక్షల ఫైనల్ కీలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: support@tslprb.in  లేదా 93937 11110/ 93910 05006 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.


కానిస్టేబుల్, ఎస్‌ఐ ఫలితాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆన్సర్ కీలు ఇలా..


SCT PC Civil and / or Equivalent:


➥ SCT PC Civil and / or Equivalent / Transport Constable / Prohibition & Excise Constable


SCT SI Civil and / or Equivalent FWE Final Keys:


➥ Arithmetic and Test of Reasoning / Mental Ability


➥ General Studies
 
➥ English Language
 
➥ Telugu Language
 
➥ Urdu Language


SCT PC IT & CO / Mechanic / Driver FWE Final Key:


➥ FWE FINAL Key - SCT PC IT & CO
 
➥ FWE FINAL Key - SCT PC MECHANIC
 
➥ FWE FINAL Key - SCT PC DRIVER



SCT SI IT&CO / SCT SI PTO / SCT ASI FPB FWE Final Keys:


➥ SCT SI IT & CO (Technical Paper)

➥ SCT SI PTO (Technical Paper)

➥ SCT ASI FPB (Technical Paper)

➥ Arithmetic and Test of Reasoning / Mental Ability

➥ English Language


Driver Operator in Fire Services Department FWE Final Key:


➥ FWE Final Key - DRIVER OPERATOR


Transport Constable FWE Final Key:


➥ SCT PC Civil and / or Equivalent / Transport Constable / Prohibition & Excise Constable


Prohibition & Excise Constable FWE Final Key:


➥ SCT PC Civil and / or Equivalent / Transport Constable / Prohibition & Excise Constable