తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గత మార్చి - ఏప్రిల్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించిన‌ట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ మంగళవారం (మే 30) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టుల‌కు సంబంధించి తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో మే 30న రాత్రి నుంచి అందుబాటులో ఉంచ‌నున్నారు. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ ప్ర‌క‌టించింది.


ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 (90.90 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 (75.56 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 (74.84 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 (23.40 శాతం), ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 (89.53 శాతం), ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 (77.54 శాతం), ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 (79.97 శాతం), ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 (82.07 శాతం) మంది అర్హ‌త సాధించారు.


వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష రెస్పాన్స్ (ఓఎంఆర్) షీట్లను మే 30న రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థుల స్కానింగ్ ఓఎంఆర్ షీట్లతోపాటు, పరీక్షల ఫైనల్ కీలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఈమెయిల్: support@tslprb.in  లేదా 93937 11110/ 93910 05006 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.


రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం..
అభ్యర్థుల మార్కులు మే 30 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది. ఫైన‌ల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.2,000, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ.3,000 చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ ప్రక్రియ జూన్ 1న ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.


దరఖాస్తుల సవరణకు అవకాశం..
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదుచేసిన వివరాల్లో మార్పులు చేసుకునేందుకు పోలీసు నియామకమండలి అవకాశం కల్పించింది. అభ్యర్థుల తుది మెరిట్ జాబితా వెల్లడి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వివరాలను సవరించుకునే వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు తమ కమ్యూనిటటీ, వయసు, స్థానికత్వం, ఎక్స్-సర్వీస్‌మెన్ స్టేటస్, అకడమిక్ క్వాలిఫికేషన్ తదితర వివరాలను సవరించుకోవచ్చు.



ప్రిలిమ్స్ ఫలితాల తీరు ఇలా..
తెలంగాణలో 554 ఎస్‌ఐ పోస్టులకు గతేడాది ఆగస్టు 7న, అలాగే 16,321 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ రాతపరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక కానిస్టేబుల్ పరీక్షకు మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాల్లో మొత్తం 41.67 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా.. 1,05,603(46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్‌ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా.. 1,84,861(31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా.. 18,758(44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా.. 1,09,518(43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.


ఫిజికల్ ఈవెంట్లు ఇలా..
తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 


ఫైనల్ పరీక్షలు ఇలా..
ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 1,11,209 మంది అభ్యర్థులకు ఈ ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 30 వరకు తుది విడత రాతపరీక్షలను పోలీసు నియామక మండలి నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించింది. తుది రాత ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించారు. 


Also Read:


ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో 1365 అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు, అర్హతలివే!ఇండియన్ నేవీలో అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్-SSR) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 1,365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 29న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ (ఎంఆర్‌) పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2023-నవంబర్‌ 23 బ్యాచ్‌) శిక్షణ ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 29 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రిక్యులేషన్‌ (పదోతరగతి) ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..