తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రాష్ట్రంలోని ఏఆర్టీ సెంటర్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏఆర్టీసెంటర్లలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులను; ఐసీటీసీ/పీపీటీసీటీ సెంటర్లలో ల్యాబ్ టెక్నీషియన్, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏఆర్‌టీ సెంటర్లలో వారి ధృవపత్రాలతో పాటు జిరాక్స్ కాపీలతోపాటు, దరఖాస్తులను సమర్పించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 


వివరాలు:..


మొత్తం ఖాళీల సంఖ్య : 33


1. మెడికల్ ఆఫీసర్లు: 04 పోస్టులు


అర్హత: ఎంబీబీఎస్.


జీతం: రూ. 72,000.


2. స్టాఫ్ నర్స్: 02 పోస్టులు


అర్హత: జనరల్ నర్సింగ్(GNM)/ బీఎస్సీ నర్సింగ్‌తో 5 సంవత్సరాల అనుభవంతో పాటు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విభాగంలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.


జీతం: రూ. 21,000.



Also Read:    తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు


3. ఫార్మసిస్ట్: 01 పోస్టు


అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమాతో పాటు ఆరోగ్య సంరక్షణ సంస్థలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


జీతం: రూ. 21,000.


4. ల్యాబ్ టెక్నీషియన్: 09 పోస్టులు


అర్హత: మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ (బీఎస్సీ)తో పాటు కనీసం 1 సంవత్సరం అనుభవం లేదా డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ (DMLT)తో పాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


జీతం: రూ. 21,000.


5. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్: 05 పోస్టులు


అర్హత: మాస్టర్స్ డిగ్రీ (పబ్లిక్ హెల్త్‌)/ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్/ సోషల్ సైన్స్/ సైకాలజీ/ అప్లైడ్ ఎపిడెమియాలజీ/ డెమోగ్రఫీ/స్టాటిస్టిక్స్/ పాపులేషన్ సైన్సెస్.


జీతం: రూ. 54,300

Also Read:  తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!


6. క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్: 05 పోస్టులు


అర్హత: మాస్టర్స్ డిగ్రీ (పబ్లిక్ హెల్త్‌)/ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్/ సోషల్ సైన్స్/ సైకాలజీ/ అప్లైడ్ ఎపిడెమియాలజీ/ డెమోగ్రఫీ/ స్టాటిస్టిక్స్/ పాపులేషన్ సైన్సెస్.


జీతం: రూ.46.800.


7. డేటా మానిటరింగ్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్: 05 పోస్టులు


అర్హత: మాస్టర్స్ డిగ్రీ (పబ్లిక్ హెల్త్‌)/ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్/హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్/ సోషల్ సైన్స్/ సైకాలజీ/ అప్లైడ్ ఎపిడెమియాలజీ/ డెమోగ్రఫీ/బయో స్టాటిస్టిక్స్/ పాపులేషన్ సైన్సెస్.


జీతం: రూ. 37,500.


8. జాయింట్ డైరెక్టర్(ఐఈసీ): 01 పోస్టు


అర్హత: మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ (డిగ్రీ/డిప్లొమా) లేదా ఎంబీఏ.


జీతం: రూ. 67,900.


9. డిప్యూటీ డైరెక్టర్(ఐసీటీసీ): 01 పోస్టు


అర్హత: ఎంబీబీఎస్‌, కమ్యూనిటీ మెడిసిన్/ PSM/కమ్యూనిటీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ (డిగ్రీ/డిప్లొమా) ఉండాలి.



Also Read:  ఈవో పోస్టుల దరఖాస్తు ప్రక్రియ షురూ, మహిళలు మాత్రమే అర్హులు!


జీతం: రూ. 50,680/


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2022.


Notification & Application


Website 



 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...