పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఫిజికల్ ఎఫిసెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు డిసెంబరు 8న ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 12 మైదానాల్లో జనవరి 3 వరకు జరిగే ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా మైదానాల్లో ట్రయల్ రన్ కూడా అధికారులు నిర్వహించారు. ఎలాంటి అవకతవకలు, తప్పులకు ఆస్కారం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బయో మెట్రిక్, ప్రతి అభ్యర్థి చేతికి చిప్‌తో కూడిన రిస్ట్ బ్యాండ్, డిజిటల్ చిప్‌తో ఉన్న ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్‌ను అటాచ్ చేయనున్నారు. వీటి ద్వారా ఈవెంట్స్ పారదర్శకంగా జరిగేలా పక్కాగా ఏర్పాట్లు చేశారు.
ఎంపిక చేసిన మైదానాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులో ఉంచడంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఈవెంట్లను పర్యవేక్షించనున్నారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈవెంట్లు జరగుతాయి. అభ్యర్థులు రిక్రూట్మెంట్ బోర్డు కేటాయించిన తేదీలలో హజరు కావాలని, తమతో పాటు అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, డాక్యుమెంట్స్, పార్ట్–2 అప్లికేషన్ నుంచి సంబంధిత సర్టిఫికెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలను తీసుకురావాలన్నారు.
ప్రక్రియ సాగేదిలా..
🔰 ముందుగా అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులకు టోకెన్ నెంబర్ ఇచ్చి ప్రాంగణంలోకి అనుమతిస్తారు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. బయోమెట్రిక్ తర్వాత రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ జాకెట్స్ అటాచ్ చేసుకున్న పురుష అభ్యర్థులకు 1,600 మీటర్లు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తారు. నిర్ణీత సమయంలో రన్నింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
🔰 పరుగుపందెంలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో నిర్ణీత ఎత్తు ఉన్న వారికి మాత్రమే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అర్హత సాధిస్తేనే తుది రాతపరీక్షకు అర్హులుగా పరిగణిస్తారు.
🔰 వీరికి మాత్రమే ఫైనల్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జారీ చేసి, పరీక్ష నిర్వహిస్తారు.
దళారుల ప్రమేయం లేకుండా..
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో పూర్తి స్థాయిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. బందోబస్తు కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లలో డీసీపీలు, ఏసీపీలు, మంది సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్ ఆఫీసర్లు- బందోబస్తు డ్యూటీలో పాల్గొంటున్నారు. అభ్యర్థులు వారికి నిర్దేశించిన తేదీల్లో ఉదయం 5 గంటలకు ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకుని క్యూలైన్లో నిలబడి టోకెన్ పొందాలి. పరేడ్‌గ్రౌండ్‌లో మెడికల్ టీమ్, షామియానాలు, మంచినీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
12 మైదానాల్లో ఈవెంట్లు...
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.
🔰 హైదరాబాద్- ఎస్ఏఆర్‌సీపీఎల్ - అంబర్‌పేట
🔰 సైబరాబాద్- 8వ బెటాలియన్ కొండాపూర్
🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం
🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం
🔰 రాచకొండ- సరూర్‌నగర్ స్టేడియం
🔰 కరీంనగర్- సిటీపోలీస్ శిక్షణ కేంద్రం
🔰 ఆదిలాబాద్- పోలీస్ పరేడ్ గ్రౌండ్
🔰 నిజామాబాద్ రాజారాం స్టేడియం, నాగారం(నిజామాబాద్)
🔰 మహబూబ్‌నగర్- డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్
🔰 వరంగల్- హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం
🔰 ఖమ్మం- పోలీస్ పరేడ్ గ్రౌండ్
🔰 నల్గొండ- మేకల అభినవ్ స్టేడియం.
అభ్యర్థులకు సూచనలు..
➥ ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సమయం, తేదీలో రిపోర్ట్ చేయాలి. సమయపాలన పాటించాలి.
➥ అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లెటర్, అభ్యర్థి సంతకం చేసిన పార్ట్-2 అప్లికేషన్ ప్రింట్ కాపీని తీసుకురావాలి.
➥ ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీ తెచ్చుకోవాలి.
➥ అభ్యర్థులు ఉదయం 5 గంటలకే పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలి.
➥ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలిప్పిస్తామని చెబితే, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.
➥ అనవసరమైన వ్యక్తిగత వస్తువులను తీసుకురావద్దు.
➥ మహిళలు ఆభరణాలు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్‌లను వెంట తెచ్చుకోవద్దు. మొబైల్ ఫోన్లను అనుమతించరు.
➥ బయోమెట్రిక్ డేటా ఆధారంగా అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ ఉంటుంది. మెహంది, పచ్చబొట్లు బయోమెట్రిక్ ధృవీకరణకు ఆటంకం కలిగించేలా ఉండొద్దు.
Also Read: ఫిజికల్ ఈవెంట్స్‌కు అంతా రెడీ, అభ్యర్థులు వాళ్లను నమ్ముకుంటే అంతే సంగతులు!