TSLPRB Police Physical Events: పూర్తి పారదర్శకంగా శారీరక దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమినషర్ ఏ.వి. రంగనాథ్ తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు నిర్వహించబడే స్టయిఫండరీ ట్రైనీ కానిస్టేబుళ్ళు, సబ్-ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కోనసాగుతుందన్నారు. ఎవరైనా తప్పుడు మార్గంలో ఉద్యోగం ఇప్పిస్తామని, లేదా మీకు ఉద్యోగం వచ్చే విధంగా సహాయం చేస్తామని దళారీలు చెబితే వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. అభ్యర్థులకు అలాంటి వ్యక్తులు కనిపించినా, లేదా మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందితే వరంగల్ పోలీస్ కమిషనర్ నంబర్ 9491089100గాని పరిపాలన విభాగం అదనపు డిసిపి: వైభవ్ గైక్వాడ్ నంబర్ 9440795201కు సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. అభ్యర్థులు దళారులతో కలిపి జాబ్ కోసం ట్రై చేస్తే నష్టపోయేది అభ్యర్థులేనని, జాగ్రత్తగా దేహ దారుఢ్య పరీక్షలు పూర్తిచేసుకోవాలన్నారు.


తప్పకుండా సూచనలు పాటించాలి-
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు పాటించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అభ్యర్థులకు సూచనలు చేశారు.
- రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం (అడ్మిట్ కార్డ్, ఇంటిమేషన్ లేటర్) తమ వెంట తీసుకరావాలి.
- అభ్యర్థి స్వీయ నంతకముతో కూడిన పార్టు 2 ధరఖాస్తు ఫారం, ప్రింట్, కలిగిన మాజీ సైనిక దృవీకరణ పత్రం( పి.పి. టి / డిన్ఛార్జ్ బుక్ ), నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ( ఇంకా సర్వీసు నుండి డిన్ఛార్జ్ కానివారికి ), తేది 12-06-2-2018 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 24, ట్రైబల్ వెల్పేర్ ( ఎన్టీఆర్ −1) జారీచేసిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికేటును అభ్యర్థులు తమ వెంట తీసుకరావల్సి వుంటుంది.
- పురుషు అభ్యర్థులకు 1600 మీటర్ల వరుగు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహింబడుతుంది.ఈ వరుగులో అర్హత సాధిస్తేనే ఎత్తు కొలతలు, లాంగ్ జంప్ షార్ట్పుట్ పరీక్షలకు
అభ్యర్థులు అర్హత సాధిస్తారు.
- అభ్యర్థులు నిర్ధేశించిన తేదిల్లో ఉదయం ఐదు గంటలోపు శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హజర్ కాల్సి వుంటుంది. అభ్యర్థులు సమయానికి రానిచో అభ్యర్థిత్వం రద్దు అవుతుంది.
- అభ్యర్థులు ధరింపజేసిన రిస్ట్ బ్యాండ్ను తొలగించడంగాని, డ్యామేజ్ చేయడం చేస్తే వారిని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది.
- అభ్యర్థులు పరీక్ష నిర్వహణ కేంద్రంలోకి ప్రవేశించిన అనంతరం అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే మైదానం నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతినిస్తారు.
- అభ్యర్థులు మైదానం తమ సామాన్లను భద్రపర్చుకొనేందుకుగాను ఎలాంటి క్లాక్ రూములు అందుబాటులో వుండవు. కావున అభ్యర్థులు తమ వెంట దుస్తులు, ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహాయించి ఎటువంటి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లేదా నిషేదిత వస్తువులు , సెల్ఫోన్,ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వరికరాలు, వస్తువులను పరీక్షలు జరిగే మైదానంలోకి అనుమతించబడవు.
- ద్విచక్ర వాహనాల ద్వారా వచ్చే అభ్యర్థులు కాకతీయ విశ్వవిధ్యాలము మొదటి ద్వారం వద్ద పార్కింగ్ చేసుకోని కాలినడకన దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించబడే మైదానికి చేరుకోవాల్సి వుంటుంది.
- బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్థుల పరిశీలన వున్నందున అభ్యర్థులు చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర రంగువేసుకోని రావద్దు.
- అభ్యర్థులు ప్రతి ఈవెంట్ వద్ద మరియు ధృవ పత్రాల పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో " క్యూ వద్దతిన పాటించాల్సి వుంటుంది. పరీక్ష నిర్వహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలను పాటిస్తూ అత్మ విశ్వాసంలో ఈ పరీక్షలో పాల్గొని విజయం సాధించాలని ఈ పరీక్షలకు హజరవుతున్న అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు.