తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ఏప్రిల్ 28న వెలువడింది. దీనిద్వారా 123 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 46 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 20 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 55 పోస్టులు, గురుకుల పాఠశాలల్లో 2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష, డెమో ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 


వివరాలు..


* మ్యూజిక్ టీచర్: 123 పోస్టులు


➥ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు: 46 పోస్టులు


➥ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు: 20 పోస్టులు


➥ బీసీ గురుకుల పాఠశాలలు: 55 పోస్టులు


➥ గురుకుల పాఠశాలలలు: 02 పోస్టులు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు డిప్లొమా (ఇండియన్ మ్యూజిక్)/ డిగ్రీ (ఇండియన్ మ్యూజిక్)/ డిప్లొమా (లైట్ మ్యూజిక్)తోపాటు నాలుగేళ్ల సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. (లేదా) ఎంఏ (ఫోక్ ఆర్ట్స్/మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్) (లేదా) బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు డిప్లొమా (క్లాసికల్ మ్యూజిక్-కర్నాటక/హిందూస్థానీ మ్యూజిక్) అర్హత ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2005 - 02.07.1979 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. 


ఎంపిక విధానం: మొత్తం 125 మార్కులకు  ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో రాతపరీక్షకు 100 మార్కులు, డెమాన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు కేటాయించారు. 


రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో జనరల్ స్టడీస్, మ్యూజిక్ & మ్యూజిక్ ఎడ్యుకేషన్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.



పేస్కేలు: మ్యూజిక్ టీచర్ పోస్టులకు రూ.31,040– రూ.92,050, మ్యూజిక్ టీచర్ (డీఈపీడీఎస్సీ & టీపీ) పోస్టులకు రూ.33,750 - రూ.99,310. 


ముఖ్యమైన తేదీలు...


➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.04.2023.


➦  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.05.2023.


Notification


Online Application


Website


                                   


Also Read:


 తెలంగాణ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!


తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


➥ తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే! 


➥ గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం - అర్హతలివే!


➥ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!


➥ గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..