తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర ప్రకటన ఏప్రిల్ 28న అధికారులు విడుదల చేశారు. దీనిద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్జెక్టులవారీగా చూస్తే.. తెలుగు-488, సంస్కృతం-25, ఉర్దూ-120, హిందీ-516, ఇంగ్లిష్-681, మ్యాథమెటిక్స్-741, ఫిజికల్ సైన్స్-431, బయోలాజిక్ సైన్స్-327, జనరల్ స్టడీస్-98, సోషల్ స్టడీస్-579 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.


వివరాలు..


* ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు


మొత్తం ఖాళీల సంఖ్య: 4006


➥ సాంఘిక సంక్షేమ గురుకులాలు


పోస్టుల సంఖ్య: 728


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 98, హిందీ - 65, ఇంగ్లిష్ - 85, మ్యాథమెటిక్స్ - 101, ఫిజికల్ సైన్స్ - 147, బయోలాజికల్ సైన్స్ - 45, సోషల్ స్టడీస్ - 187.


➥ గిరిజన సంక్షేమ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 218 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 28, హిందీ - 39, ఇంగ్లిష్ - 19, మ్యాథమెటిక్స్ - 29, ఫిజికల్ సైన్స్ - 15, బయోలాజికల్ సైన్స్ - 21, జనరల్ స్టడీస్ - 20, సోషల్ స్టడీస్ - 47.


➥ బీసీ సంక్షేమ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 2379 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 285, హిందీ - 263, ఇంగ్లిష్ - 506, మ్యాథమెటిక్స్ - 520, ఫిజికల్ సైన్స్ - 269, బయోలాజికల్ సైన్స్ - 261, సోషల్ స్టడీస్ - 275.


➥ మైనార్టీ గురుకులాలు 


పోస్టుల సంఖ్య: 594


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 55, ఉర్దూ-120, హిందీ - 147, ఇంగ్లిష్ - 55, మ్యాథమెటిక్స్ - 86, సోషల్ స్టడీస్ - 103, జనరల్ స్టడీస్ - 76, సోషల్ స్టడీస్ - 55.


➥ గురుకుల పాఠశాలలు 


పోస్టుల సంఖ్య: 87 


సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు - 22, సంస్కృతం-25, హిందీ - 02, ఇంగ్లిష్ - 16, మ్యాథమెటిక్స్ - 05, జనరల్ స్టడీస్ - 02, సోషల్ స్టడీస్ - 15.


అర్హతలు..


➥ 50 శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ/బీకామ్ డిగ్రీ అర్హత ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్టులతో మెథడాలజీ ఒక సబ్జెక్టుగా బీఈడీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 


(లేదా) 


➥ 50 శాతం మార్కులతో నాలుగేళ్ల బీఏ బీఈడీ/బీఎస్సీ బీఈడీ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 


(లేదా) 


➥ 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ డిగ్రీలో సంబంధిత లాంగ్వేజ్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/సంబంధిత లాంగ్వేజ్‌తో బీఈడీ ఉండాలి. బీఈడీలో మెథడాలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఏపీటెట్/టీఎస్‌టెట్ పేపర్-2 ఉత్తీర్ణత ఉండాలి. టెట్ అర్హత ఉన్నవారికి 20 శాతం వెయిటేజీ ఉంటుంది. గురుకుల నియామక బోర్డు నిర్వహించే రాతపరీక్షకు 80 శాతం మెయిటేజీ ఉంటుంది. అయితే టెట్ స్కోరుకు 02-06-2014 లోపు ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2005 - 02.07.1979 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


రాతపరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. వీటి నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫీషియన్సీ (ఇంగ్లిష్) 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2 పెడగోజీ (అభ్యర్థి సబ్జెక్టు) 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-3 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 120 నిమిషాల సమయం ఉంటుంది.



పేస్కేలు: రూ.42,300 – రూ.1,15,270, రూ.45,960 – రూ.1,24,150.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.04.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.05.2023.


Notication


Online Application


Website


                     


Also Read:


 తెలంగాణ గురుకులాల్లో 123 మ్యూజిక్ టీచర్ పోస్టులు, వివరాలు ఇలా! 


తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


➥ తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు, అర్హతలివే! 


➥ గురుకుల పాఠశాలల్లో 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం - అర్హతలివే!


➥ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!


➥ గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!


➥ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 88 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..