ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. అయితే దరఖాస్తు గడువు జూన్‌ 28తో ముగియనుంది. వాస్తవానికి దరఖాస్తు గడువు జూన్ 21తో ముగియాల్సి ఉన్నప్పటికీ జూన్ 28 వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.


ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,053 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


వివరాలు..


* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023


ఖాళీల సంఖ్య: 8612


1) ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5538 పోస్టులు


ఏపీలో ఖాళీలు: 678.


2) ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 2485 పోస్టులు


ఏపీలో ఖాళీలు: 261.


3) ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 516 పోస్టులు


విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-60, మార్కెటింగ్ ఆఫీసర్-03, ట్రైజరీ మేనేజర్-08, లా ఆఫీసర్-24, సీఏ-21, ఐటీ-68, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-332, 


3) ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 73



అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.


అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.


వయోపరిమితి (01.06.2023 నాటికి):


➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1983 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1991 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1993 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి. 


➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.06.1995 - 01.06.2005 మధ్య జన్మించి ఉండాలి. 


➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 


ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.


పరీక్ష విధానం:



ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023. (28.06.2023 వరకు పొడిగించారు)


➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.


➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.


➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.


➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2023.


➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌, 2023.


➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2023.


Click here to apply for the post of Officer Scale I

Click here to apply for the post of Officer Scale II/III


Click here to apply for the post of Office Assistant (Multipurpose)


నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial