TSPSC AEE Result: ఏఈఈ పరీక్ష ఫలితాలు విడుదల, ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన 3092 మంది అభ్యర్థులు

Telanganaలో ఏఈఈ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. 3092 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికయ్యారు.

Continues below advertisement

TSPSC AEE Selection Results: తెలంగాణలో ఏఈఈ నియామాకాలకు నిర్వహించిన ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ మార్చి 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. మొత్తం 1540 పోస్టులకుగాను 1:2 నిష్పత్తిలో 3092 మంది అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ ఎంపికచేసింది. వీరిలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో 188 మంది అభ్యర్థులు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2362 మంది అభ్యర్థులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో 338 మంది అభ్యర్థులు, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 204 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు.

Continues below advertisement

ఏఈఈ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే వేదిక: Admission Block, JNTU Kukatpally, Hyderabad.

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం.. 

1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.

2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  

3) పరీక్ష హాల్‌టికెట్

4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 

5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 

6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 

7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).

8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.

9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).

11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 

12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. 

13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1540 పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబరు 3న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)  నోటిఫికేషన్ విడుదలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్ నోటీస్ విడుదల చేసిన కమిషన్, సెప్టెంబర్ 15న పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు గడువు నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో అక్టోబర్ 20 వరకు అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించారు. మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. తుది స్కోరు ఖ‌రారులో నార్మలైజేష‌న్ ప‌ద్ధతిని పాటించింది. 

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

జీతం: రూ.54,220- రూ.1,33,630.

పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement