Naga panchami Telugu Serial Today Episode : పంచమి ఇంట్లో వాళ్లతో కచ్చితంగా మోక్షాబాబు పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది. మోక్ష తీరు చూస్తే నాకు డౌటే అని జ్వాల అంటుంది. దీంతో మోక్షని వైదేహి పిలిచి రేపు ఊరు వెళ్తున్నామని ఎల్లుండే మీ పెళ్లి అని చెప్తుంది. 


రఘురాం: మోక్షా ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం నేను ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాం. 
వైదేహి: ఏదైనా తేడా వస్తే శివరాత్రి రోజు నా శవాన్ని చూస్తావ్ మోక్ష. నేను మళ్లీ మేఘనకు నా ముఖం చూపించలేను. 
పంచమి: మీరు భయపడకండి అత్తయ్య. మోక్షాబాబుని తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మి మేఘన పెళ్లికి ఒప్పుకుంది. నేను బతికి ఉండగా మేఘనకు అన్యాయం చేయను. మీకు నేను మాటిస్తున్నాను. మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు.
శబరి: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వీళ్ల విషయం ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు రఘురాం. ముఖ్యంగా మనం వెళ్తుంది శివుడి పూజ కోసం ముందు ఆ ఏర్పాట్లు చేసుకోండి. 
చిత్ర: అత్తయ్య నేను రావడం లేదు నన్ను బలవంతం చేయకండి..


మరోవైపు నాగేశ్వరి పంచమి కన్నతల్లి మహారాణి ఆత్మను పిలిచి నాగదేవతను ఎంత వేడుకున్నా దర్శనం ఇవ్వలేదు అని చెప్తుంది. 


మహారాణి: మరి నా కూతురిని ఎలా కాపాడుతావు నాగేశ్వరి.
నాగేశ్వరి: నేను ఇక్కడే ఉండి రహస్యంగా వేసే ఎత్తులు ముందుగానే గ్రహించి యువరాణిని కాపాడుకుంటాను మహారాణి. 
మహారాణి: కాపాడి నా కూతురున్ని నాగలోకం తీసుకెళ్లు. అప్పుడే నా ఆత్మకు విముక్తి కలుగుతుంది. ఎలా అయినా ఈ సాయం చేయు నాగేశ్వరి.
నాగేశ్వరి: నా సాయశక్తులా ప్రయత్నించి యువరాణిని కాపాడగలను. కానీ తన భర్త మోక్షను వదిలి యువరాణి నాగలోకం వస్తుంది అని మాత్రం నాకు నమ్మకం లేదు. మీకు ఆ మాట ఇచ్చి మీ కోరిక తీర్చలేను. నన్ను క్షమించండి మహారాణి. 
మహారాణి: అయితే నాకు ఓ సాయం చేస్తావా నాగేశ్వరి. నా కోరిక తీరకపోతే నా ఆత్మకు విముక్తి లభించదు. నువ్వు నా ఆత్మను ప్రేరేపించి నా కూతురి గర్భంలో ప్రవేశించేలా చేయగలిగితే చాలు నేను నా కూతురు పంచమికి కూతురుగా నాగ అంశంతోనే పుడతాను. నువ్వు ఆ బిడ్డను రక్షించి నాగలోకం చేర్చు నాగేశ్వరి. 
నాగేశ్వరి: నాగంశలో పుట్టిన పంచమి విష కన్య. తను భర్తతో కలిస్తే మోక్ష ప్రాణాలతో ఉండడు. పంచమి గర్భం దాల్చే అవకాశమే లేదు మహారాణి. 
మహారాణి: చాలా పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. 
నాగేశ్వరి: దిగులు పడకండి మహారాణి. ముందు నేను యువరాణిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. కరాళి పీడ వదిలిపోతే పంచమి క్షేమంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. 


మేఘన: మోక్షతో మాట్లాడాలి అన్నారు చెప్పండి.
మోక్ష: నీకు ఈ ఇంట్లో అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి మేఘన. మనం అనుకున్నది వేరు ప్రస్తుతం జరుగుతున్నది వేరు. నాటకం కాస్త నిజం అయ్యేలా ఉంది. 
మేఘన: నిశ్చితార్థంతోనే మన నాటకానికి తెరపడింది మోక్ష. ఇప్పుడు నిర్ణయం మీ చేతిలో లేదు. మీ అమ్మగారు చెప్పినట్లు మీరు విని తీరాల్సిందే.
మోక్ష: అంటే నువ్వు కూడా నాతో పెళ్లికి ఫిక్స అయిపోయావా.
మేఘన: అలాంటి పరిస్థితులు మీరే కల్పించారు. మోక్ష. మీరు పంచమి కలిసి ఉండాలని నేను ఎంతో కోరుకున్నాను. ఇప్పుడు నేను చేయగలిగేది ఏం లేదు.
మోక్ష: మన పెళ్లి జరగకూడదు మేఘన.
మేఘన: పంచమి మీద మీరు ఇంకా ఆశలు పెట్టుకున్నారా మోక్షాబాబు. 
మోక్ష: నాలో ప్రాణం ఉన్నంత వరకు పంచమిని వదులుకోను మేఘన.
మేఘన: పంచమి ఒప్పుకోదు మోక్ష. మన పెళ్లి చేసి నాగలోకం వెళ్లిపోవాలి అనుకుంటుంది. మనసులో.. చూస్తుంటే మోక్ష నన్ను వెళ్లిపోమనేలా ఉన్నాడు. అలాంటి అవకాశం ఇవ్వకూడదు.
మోక్ష: నువ్వు నాకు ఓ సాయం చేయాలి మేఘన. ఎవరికీ తెలీకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అప్పుడు పెళ్లి ఆగిపోతుంది.
మేఘన: నీ కోసం ఇప్పటికే చాలా చేశాను మోక్ష. రహస్యంగా వెళ్లిపోయి అందరి దగ్గర దొంగ అనిపించుకోను. అంతేకాదు నేను కనిపించని మరుక్షణం నాగలోకం వెళ్లిపోతాను అని పంచమి నా దగ్గర మాట తీసుకుంది. నేను ఇక్కడ ఉండటం వల్ల మేలు జరుగుతుంది తప్ప కీడు జరుగుతుంది.  


ఫణేంద్ర: మీ ఆశీస్సులు ఫలించాయి మాతా. శుభవార్తతోనే వచ్చాను.
నాగదేవత: యువరాణి నాగలోకంలో పాదం మోపినప్పుడే సంపూర్ణ విజయం దక్కినట్లు ఫణేంద్ర. 
ఫణేంద్ర: ఆ శుభముహూర్తం వచ్చేసింది మాతా. రేపు శివరాత్రికి పూజ పూర్తిచేసుకొని యువరాణికి ఆహ్వానం పలికే పండగ చేసుకోబోతున్నాం. 
నాగదేవత: అయితే నమ్మకంగా స్వాగత  ఏర్పాట్లు చేసుకోవచ్చా ఫణేంద్ర.
ఫణేంద్ర: ఘనంగా మాతా. నాగలోకం రావడానికి యువరాణి సిద్ధంగా ఉంటుంది.
నాగదేవత: కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా నీ మాటలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. నాగలోకానికి రాణి లేని లోటు తీర్చినందుకు నువ్వు ఏ కోరిక కోరిన నేను తీర్చుతాను ఫణేంద్ర.
ఫణేంద్ర: యువరాణిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు ఇంకేం కోరికలు లేవు మాతా.
నాగదేవత: ఆ కార్యం యువరాణి అంగీకారంతో జరుగుతుంది. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఫణేంద్ర. 
ఫణేంద్ర: యువరాణిని ఎలా అయినా ఒప్పుంచుకుంటాను మాతా..


చిత్ర పూజకు సంబంధించిన అన్ని సమాన్లు రెడీ చేశాను అని కారులో సిద్ధంగా పెట్టాను అని అంటుంది. దీంతో జ్వాల పల్లెటూరి పెళ్లికి ఏం అవసరాలు వస్తాయి పసుపు తాడు పెట్టు సరిపోతుంది అని అంటుంది. 


వైదేహి: మోక్ష తెల్లారే మనం బయల్దేరాలి. రెడీగా ఉండండి.. పంచమితో.. రేపటితో నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు. నీకు సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంట్లో ఉండకూడదు. అన్నీ సర్ది పెట్టుకో..
పంచమి: అలాగే.. 
వైదేహి: రేపు నువ్వు ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత తిరిగి ఈ ఇంట్లో కాలు పెట్టనని మీ ఊరి గుడిలోని శివయ్య దగ్గర నాకు ప్రమాణం చేయాలి.
రఘురాం: వైదేహి ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా..
వైదేహి: మీకు తెలీదు అండి. రేపటితో మనకు తన పీడ వదిలిపోవాలి. నిన్నే అడిగేది సమాధానం చెప్పు. ప్రమాణం చేస్తావా లేదా..
పంచమి: చేస్తాను. 
మీనాక్షి: అమ్మా పంచమిని చూస్తుంటే నాకు ఎక్కడ లేని కోపం వస్తుందమ్మా. ఎవరైనా బుద్ధున్న వాళ్లు తన భర్తను మరొకరితో పెళ్లి చేస్తారా.. 
శబరి: పంచమికి ఆత్మాభిమానం ఎక్కువ మీనాక్షి. వైదేహి మాటలు మనసును తొలచేసి ఉంటాయి. 
మీనాక్షి: కట్టుకున్న భర్తని చేజేతులా వదులు కుంటుందా. అవసరం అయితే వేరు కాపురం పెట్టుకోవాలి. 
శబరి: వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలీడం లేదు మీనాక్షి. పంచమి మనసు మారాలి అని పూజ ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఆ స్వామి ఆ బిడ్డను ఏం చేస్తాడో చూడాలి. 


మేఘన తన అన్న నంబూద్రీ ఆత్మని పిలిచి రేపు గ్రామం వెళ్తున్నాం అని మోక్షని పెళ్లి చేసుకొని బలి ఇచ్చేస్తా అని అంటుంది. పంచమి ప్రాణాలతో ఉంటే తనకు ఎప్పటికైనా ప్రమాదమే అని మోక్షతో తన పెళ్లి అయిపోగానే పంచమిని నాగలోకం వెళ్లకుండా ఆపాలి అని తనకు శక్తులు రాగానే పంచమిని బంధించి నాగమణి దక్కించుకునే అవకాశం ఉందేమో చూస్తాను అని అంటుంది. మరోవైపు మోక్ష ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కిరణ్ రావ్: అప్పుడు తిట్టింది, ఇప్పుడు చూస్తానంటుంది - ‘యానిమల్’ మూవీ చూస్తనంటోన్న అమీర్ ఖాన్ భార్య