తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష తేదీని టీఎఎస్‌పీఎస్సీ అక్టోబరు 29న వెల్లడించింది. ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 22న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను  పరీక్షకు వారంరోజుల ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో  ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1540 పోస్టుల భర్తీకి సెప్టెంబరు 3న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)  నోటిఫికేషన్ విడుదలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్ నోటీస్ విడుదల చేసిన కమిషన్, సెప్టెంబర్ 15న పూర్తి నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తు గడువు నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో అక్టోబర్ 20 వరకు అవకాశం కల్పించారు. 

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION: HYDERABAD
ASSISTANT EXECUTIVE ENGINEERS IN VARIOUS ENGINEERING SERVICES
Notification No.12/2022

WEB NOTE

It is hereby informed that, the candidates who have applied for the post of Assistant Executive Engineers vide Notification No.12/2022, the Commission decided to conduct Examination for above said notification on 22/01/2023, The candidates can download hall-ticket on TSPSC website (www.tspsc.gov.in ) one week before the examination date.

Dt: 29/10/2022                                                                                                                        Sd/-Secretary
Hyderabad. 

 

పోస్టుల వివరాలు...

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540. 

 
1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).

 

 2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

 

 3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). AMIE (సివిల్) పరీక్ష అర్హత ఉండాలి.

 

 4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

 

 5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్  ఇంజినీరింగ్). 

 

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్). 

 

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్). 

 

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). 

వయోపరిమితి: 01.07.2022  నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 

జీతం: రూ.54,220- రూ.1,33,630.

రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.


ముఖ్యమైన తేదీలు..

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.    

 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022.   

Notification

Website

:: Also Read ::

'గ్రూప్-1' ప్రిలిమినరీ కీ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్లు అందుబాటులో! అభ్యంతరాలకు అవకాశం!!
తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ శనివారం (అక్టోబరు 29) విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను (OMR డిజిటల్ కాపీలను) కూడా అధికారిక వెబ్‌‌సై‌ట్‌లో టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ అందు‌బా‌టులో ఉంచింది. నవంబరు 29 వరకు అభ్యర్థుల OMR పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు కమిషన్ అవకాశం కల్పించింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలున్నవారు అక్టోబరు 31 నుంచి నవంబరు 4న సాయంత్రం 5 గంటల వరకు తమ అభ్యంతరాలకు తెలపవచ్చు.
ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


TSPSC Exams: 'గ్రూప్-1'తో మొదలు! ఇక టీఎస్‌పీస్సీ పరీక్షలు'ఈజీ' కాదు! 
తెలంగాణ తొలి 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సివిల్స్‌ తరహాలో కఠినంగా ఉన్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని, విశ్లేషణాత్మక, స్టేట్‌మెంట్‌ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని అన్నారు. ప్రిలిమ్స్‌ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
టీఎస్‌పీఎస్సీ పరీక్షల పూర్తి వివరాల కోసం క్లి్క్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..