హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.


వివరాలు:


1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16


విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 12, కంప్యూటర్ ఇంజినీరింగ్: 01, మెకానికల్ ఇంజినీరింగ్: 03


అర్హత: సంబధిత విభాగాలలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.


2. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 25


విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 20, కంప్యూటర్ ఇంజినీరింగ్: 01, సివిల్ ఇంజినీరింగ్: 02, ఫార్మసీ:01, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్: 01


అర్హత: సంబధిత విభాగాలలో ఇంజినీరింగ్(డిప్లొమా) ఉండాలి. 


3. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 18 


విభాగాల వారీగా ఖాళీలు: బీకాం: 12, బీఎస్సీ నర్సింగ్: 04, బీఎస్సీ కంప్యూటర్స్:  02


అర్హత: సంబధిత విభాగాలలో గ్రాడ్యూయేషన్ ఉండాలి.


దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.


ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా. ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేదు.


వాక్-ఇన్ తేదీ: 09-11-2022.


వాక్-ఇన్ వేదిక: 
Department of Training & Development,
Hindustan Aeron autics Limited, Avion ics Division, Hyderabad.
Balanagar, Hyderabad- 500042.


Notification


Website


 


:: Also Read ::



డీఆర్‌డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఈ అర్హతలు ఉండాలి!

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 7 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. వీరికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ & కేపబిలిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...