టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే అక్కడ ఓ సినిమా కూడా చేయబోతుంది. ఇప్పుడున్న పీరియడ్ లో తన కెరీర్ లో చాలా బిజీగా ఉంది సమంత. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
అయితే కొన్నాళ్లుగా ఆమె చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఏమైందా..? అని టెన్షన్ పడ్డారు. ఆమె స్కిన్ డిసీజ్ తో బాధ పడుతుందని.. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని.. ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ సమంత వాటిపై స్పందించలేదు. ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా తనకేం జరిగిందో వెల్లడించింది సమంత.
ముందుగా 'యశోద' సినిమా ట్రైలర్ కి వస్తోన్న రెస్పాన్స్ గురించి మాట్లాడింది. ప్రేక్షకులను థాంక్స్ చెప్పింది. ఆ తరువాత ''మీ అందరితో నేను షేర్ చేసుకునే ప్రేమ, అనుబంధమే.. జీవితం నాపై విసిరే ప్రతి ఛాలెంజ్ ను ఎదుర్కోవడానికి నాకు శక్తిని ఇస్తోంది. కొన్ని నెలలుగా నేను మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నాను. ఈ వ్యాధి నుంచి కోలుకున్న తరువాత మీ అందరికీ విషయం చెప్పాలనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేయడానికి ఇంకా కష్టపడుతున్నాను. అయితే నేను పూర్తిగా కోలుకుంటానని డాక్టర్స్ నమ్ముతున్నారు. ఫిజికల్ గా ఎమోషనల్ గా నేను చాలా ఫేస్ చేశాను. ఇక నేను హ్యాండిల్ చేయలేనని భావించే ప్రతీరోజు ఏదోలా గడిచిపోతుంది. దానికి అర్ధం నేను కోలుకోవడానికి మరో రోజు దగ్గరవుతున్నట్లు'' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.
మైయోసిటిస్ అనేది ప్రాణాంతక వ్యాధి. మజిల్స్ లో వాపు రావడం, విపరీతమైన నొప్పి, వీక్ నెస్ ఈ వ్యాధి లక్షణాలు. దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సమంతకు ఇలాంటి వ్యాధి సోకిందని తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి దేవుడు మరింత బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.
Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా