Groups Interviews : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేసి సాధారణ పరిపాలన శాఖ సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ ను ప్రగతి భావన్ కు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్కులు ఉండేవి. సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్ట్ ల్లో ఈ రెండింటికీ ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటల్లో ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఫ్రీ కోచింగ్
మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్న అభ్యర్థులకు మరో శుభవార్త చెప్పింది. కోచింగ్‌ల కోసం వేలకు వేలు ఖర్చుపెట్టలేని వాళ్లకు ప్రభుత్వం చదివించనుంది. స్టైఫండ్ ఇస్తూనే గ్రూప్ 1, 2లకు ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఇస్తోంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్లు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 16లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 16 ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి 21 నుంచి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. లక్షా పాతిక వేల మందికి ఈ కోచింగ్ ఇవ్వనున్నారు. 16న నిర్వహించే పరీక్షలో టాపర్స్ పదివేల మందికి స్టైఫండ్ ఇస్తారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆరునెలలపాటు నెలకు ఐదువేల రూపాయలు, గ్రూప్ 2 అభ్యర్థులకు మూడు నెలల పాటు 2వేల రూపాయలు ఎస్సై అభ్యర్థులకు నెలకు రెండు వేల రూపాయలు స్టైఫండ్ ఇస్తారు.
Also Read : Job Notifications In Telangana : తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డబుల్ బొనాంజా