తెలంగాణలో  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించింది. ఆయా పోస్టులకు  నవంబరు 20 తర్వాత వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, వైద్యారోగ్యశాఖలో  ఉద్యోగాలు, అటవీశాఖ ఉద్యోగాలు, గురుకుల టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది.


పాఠశాల విద్యాశాఖలో 134 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్!


తెలంగాణ‌లోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్ప‌టికే ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డ్డాయి. ఆయా నోటిఫికేష‌న్ల భ‌ర్తీ ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతోంది. తాజాగా పాఠ‌శాల విద్యాశాఖ‌లో 134 పోస్టుల భ‌ర్తీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం భర్తీ చేసే పోస్టుల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు (గ్రేడ్-1)- 24 పోస్టులు, డైట్‌లో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, ఎస్‌సీఈఆర్‌టీలో 22 లెక్చరర్ పోస్టులు, డైట్‌లో 65 ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల  చేయనుంది. 


త్వరలో 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ!


రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 10 రోజుల్లోపు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా మొత్తం 7 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వీటిలో 1165 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 6 వేలకు పైగా నర్సు పోస్టులతోపాటు 1569 పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 3800 ఏఎన్‌ఎం కేంద్రాలను కూడా పల్లె దవాఖానాలుగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో డీపీహెచ్‌ పరిధిలో 751 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 211 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7  పోస్టులు ఉన్నాయి. వీరికి మరో పది రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. 



Also Read:


TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్లపై బోర్డు కీలక అప్‌డేట్! 
రాష్ట్రవ్యాప్తంగా 11, 12 వేదికల్లో/ మైదానాల్లో ఫిజికల్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌తోపాటు మరో ఒకటి రెండు కొత్త ప్రదేశాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. 25 రోజుల్లో ఫిజికల్ ఈవెంట్ల ప్రక్రియను ముగించాలని అధికారులు భావిస్తున్నారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


విద్యార్థులకు గుడ్ న్యూస్, పీజీ లేకున్నా 'పీహెచ్‌డీ'లో చేరొచ్చు - ఎలాగంటే?
బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, డిగ్రీ (నాలుగేళ్లు) లాంటి కోర్సులు చేశారా.? వీటి తర్వాత పీజీ కాకుండా డైరెక్ట్‌గా పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారా.? మరి అదెలాగని ఆలోచిస్తున్నారా.. అయితే టెన్షన్ పడకండి.. విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్. యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవకున్నా.. పీహెచ్‌డీ చేసే అవకాశం పొందొచ్చు. ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలు జారీచేసింది. 
పీహెచ్‌డీ-యూజీసీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...