తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపికబురు వినిపించింది. మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేయనుంది. బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ఆర్థిక శాఖ.
Also Read:
TSPSC Recruitment: 'మున్సిపల్' ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి. కామర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
లైబ్రేరియన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఖాళీల భర్తీ ఎంపిక చేపడతారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...