ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఖాళీల్లో ఎక్కువ పోలీసు శాఖలోనే ఉన్నాయి. 16, 587 ఉద్యోగాలను ఈసారి నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయించింది. పోలీసులు శాఖ కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో టీపీఎస్సీ ద్వారా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మిగిలిన వాటిని టీఎస్‌ ఎల్‌పీఆర్‌బీతో పూరించనుంది. 


పోలీసు శాఖలో భర్తీ కానున్న 16, 587 ఉద్యోగాల్లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 4965 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్‌ ఖాళీలు 4423 ఉన్నాయి. టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్స్‌   5, 704 వెకెన్సీ చూపిస్తున్నారు. ఐటీ అండ్‌ సీ కానిస్టేబుల్స్‌ 262, పీటీవో కానిస్టేబుల్స్‌(డ్రైవర్స్‌) 100, కానిస్టేబుల్(మెకానిక్‌) పీటీవో 21, కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌) 100 ఖాళీలు ఉన్నాయి. 






సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలు 415 ఉంటే ఏఆర్‌ రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు ఉద్యోగాలు 69, టీఎస్‌ఎస్పీ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ 23, ఐటీ అండ్‌ సీ ఎస్‌ఐ పోస్టులు 23, ఎస్‌ఐ(పీటీవో), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)ఐదు ఉద్యోగాలు ఉన్నాయి. 






అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎప్‌పీబీ) 8, సైంటిఫిక్ ఆఫీసర్స్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌) 14, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌), ల్యాబ్‌ టెక్నీషియన్(ఎఫ్‌ఎస్‌ఎల్‌), ల్యాబ్‌ అసిస్టెంట్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌ 1 ఖాళీ మాత్రమే ఉంది. వీటితోపాటు ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు 390, ఎస్‌పీఎఫ్‌ ఎస్‌ఐలు 12 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. 
ఉద్యోగాల భర్తీలో భాగంగా డిప్యూటిలీ జైలర్స్‌ ఉద్యోగాలను 8 భర్తీ చేయనున్నారు. వార్డర్‌ ఖాళీలు 136 ఉన్నాయి. మహిళా వార్డర్‌ పోస్టులు 10 వాటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.