తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 'టెట్' నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. పరీక్ష నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది. టెట్ నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. టెట్ పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు కలిపి.. మొత్తం 101 రోజులు పడుతుందని అంచనా వేసింది. గతేడాది మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పరీక్షను అదే సంవత్సరం జూన్‌ 27న నిర్వహించారు. 

తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టెట్‌ నిర్వహించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించారు. అయితే అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. టెట్ పరీక్ష నిర్వహణకే 80 రోజుల సమయం పడుతుందని విద్యాశాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో.. సెప్టెంబరు చివరి వారంలోనే టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 9,370 టీచర్ పోస్టులు ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆ వివరాలను గతేడాది మార్చి 21న విద్యాశాఖ సర్కార్‌కు సమర్పించింది. ఈ పోస్టులు కాక పదోన్నతుల ద్వారా 9,314 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుందని విద్యాశాక పేర్కొంది.  

ఖాళీల భర్తీకి 'టెట్' నిర్వహించి. కొత్త టీచర్లు వచ్చే వరకు, పదోన్నతులు కల్పించే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్లు అవసరం ఉంటుందని విద్యాశాఖ ప్రతిపాదించింది. 5 వేల మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన తర్వాతే వాలంటీర్లు అవసరమని స్పష్టం చేసింది.

ఖాళీల వివరాలు ఇలా..

పోస్టులు ఖాళీల సంఖ్య
స్కూల్ అసిస్టెంట్ 2,179
ఎస్‌జీటీ 6360
లాంగ్వేజ్ పండిట్ 669
పీఈటీ 162 
మొత్తం 9370

ALSO READ:

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఎన్‌ఐఓహెచ్‌ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్‌, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్‌ బాలాఘట్‌లోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial