Startup layoffs down by nearly 70 per cent : భారత ఐటీ రంగంలో స్టార్టప్‌లు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటన్న ఆర్థిక సంవత్సరం ఇదే. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పలు ప్రముఖ స్టార్టప్ కంపెనీలు మూతపడిపోయాయి. చాలా  కంపెనీలు తమ ఉద్యోగుల్లో అత్యధిక మందిని తొలగించాయి. కానీ ఇప్పుడు మెల్లగా పరిస్థితి మెరుగుపడుతోంది. ఉద్యోగాల తీసివేత దాదాపుగా 70 శాతం తగ్గిపోయింది. కొత్తగా రిక్రూట్మెంట్లను కూడా కొన్ని కంపెనీలు ప్రారంభిస్తున్నాయి. దీంతో మాంద్యం నుంచి బయటపడుతున్నామని స్టార్టప్ కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. 


ఇటీవలి కాలంలో భారీగా స్టార్టప్ కంపెనీల్లో లే ఆఫ్‌లు


ఇప్పుడు యువ టెక్ నిపుణుల కలలు స్టార్టప్‌ల మీదనే ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా పరుగులు ప్రారంభించినవారికి  ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచి ఐడియాలు అనుకున్న  స్టార్టప్‌లు కూడా ఎగుడుదిగుడులు చూశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎడ్యూటెక్ కంపెనీ అన్‌అకాడమీ తమ మార్కెటింగ్ టీమ్  మొత్తాన్ని తొలగించింది. పాకెట్ ఎఫ్‌ఎమ్  స్టార్టప్ 103 మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధిచినప్పటికీ 200  మంది రైటర్స్ ని జూలైలో ఉద్యోగాల నుంచి తొలగించింది. చెన్నైలోని అగ్రిస్టార్టప్ వే కూల్ రెండు వందల మంది ఉద్యోగుల్ని తొలగించింది. 


చిన్న పొరపాటుకు భారీ మూల్యం, రూ.382 కోట్ల ఐటీ నోటీస్‌ - మీకూ రావచ్చు!


మూతపడిపోయిన కొన్ని ప్రముఖ స్టార్టప్‌లు


ఇక మూతపడిన కంపెనీలు కూడా ఉన్నాయి. హెల్త్ స్టార్టప్ కెన్కో, ఇన్సూర్ స్టాక్.ఏఐ, ఎడ్యూటెక్ ఫ్లాట్ ఫామ్ బ్లూలెర్న్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం కూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనుగడ సాగించలేక చేతులు ఎత్తేశాయి. అదే సమయంలో ఉనికి సమస్యలు ఎదుర్కొంటున్న ఆకాష్ లెర్నింగ్, షేర్ చాట్, దుంజో కూడా ఉద్యోగుల్ని తొలగించాయి. మొత్తంగా 95 స్టార్టప్ కంపెనీలు పధ్నాలుగు వేల మంది ఉద్యోగుల్ని  తొలగించాయి. ఇప్పుడు ఆ తీసివేతల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. అయితే ఒక్క దేశంలోనే ఇలాంటి  ట్రెండ్ లేదు. ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది పరిస్థితి. 


పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సూచనలు          


ఇప్పుడు తీసివేతల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో  ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. సీరిస్ ఫండింగ్ కోసం స్టార్టప్‌లు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. వంద మిలియన్ డాలర్ల పైమేర పెట్టుబడులు సాధిస్తున్న కంపెనీలు కూడా ఎక్కువగా నే ఉన్నాయి. పాత రోజులు మళ్లీ వస్తాయని.. టెక్ నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. 


హీరో రాజ్ తరుణ్ టూ హర్షసాయి, హైప్రొఫైల్ కేసులకు అడ్డాగా నార్సింగి పోలీస్ స్టేషన్


మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పుడు పెద్ద ఎత్తున స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాలేజీల్లో ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ప్రారంభించాయి. గతం కన్నా ఎక్కువగా రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మాంద్యం నుంచి బయటపడుతున్న సూచనలేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.