కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ) టైర్‌-2 పరీక్షల షెడ్యూలును స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటించింది. వీటితోపాటు అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నిర్వహించనున్న వివిధ రాతపరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. ఈ మేరకు ఆగస్టు 19న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

  

పరీక్ష  పరీక్ష తేదీ
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) అక్టోబరు 25 - 27 వరకు
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ (సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ) నవంబరు 2
జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్-2023 (పేపర్-2) డిసెంబరు 4
ఎస్‌ఐ- ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ ఎగ్జామ్-2023 డిసెంబరు 22

పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

15 భాషల్లో స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు, కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి జితేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రాత పరీక్షలను 15 భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల విషయంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ని సులభతరం చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. భాష కారణంగా ఎవరూ ఈ పరీక్షలు రాయకుండా ఆగిపోకూడదని అన్నారు. 14వ Hindi Consultative Committee కమిటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని, యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మొత్తం 13 స్థానిక భాషల్లో SSC రాత పరీక్ష నిర్వహించనున్నారు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురీ, కొంకణి భాషల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎన్‌ఎస్‌యూటీ న్యూఢిల్లీలో 322 ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
NSUT Delhi Recruitment 2023: న్యూఢిల్లీలోని నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 322 ప్రొఫెసర్, అసిస్ట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు దరఖాస్తు హార్డుకాపీలను పంపించాలి. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఇదే!
Medical Officer Recruitment:
 తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..