సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయ్ పోస్టుల భర్తీకి సంబంధించిన 'అప్లికేషన్ స్టేటస్' లింక్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాక్టివేట్ చేసింది. అయితే ప్రస్తుతానికి సౌత్ రీజియన్, కర్ణాటక-కేరళ రీజియన్లకు సంబంధించిన లింక్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. త్వరలోనే రీజియన్ల వారీగా అన్ని రీజినల్ వెబ్‌సైట్లలో పెట్టనుంది. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ స్టేటస్ ద్వారా దీని ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తును స్వీకరించారా లేదా రిజక్ట్ చేశారా అన్నది తెలుసుకోవచ్చు. దరఖాస్తులు సరిగ్గా ఉన్న అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. దరఖాస్తులు రిజక్ట్ అయిన అభ్యర్థులు.. అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాతే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2023, జనవరి 10 నుంచి 14 వరకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలోనే సంబంధింత రీజియన్ల వెబ్‌సైట్‌లలో అందబాటులో ఉంచనున్నారు.
South Region Application Status
Karnataka-Kerala Region Application Status
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2022 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వివిధ భద్రత బలగాల్లో మొత్తం 24,369 గ్రౌండ్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మొదల నోటిఫికేషన్ వెలువడింది. అయితే ప్రకటించిన పోస్టులకు అదనంగా 20,915 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 45,284కి చేరింది. వీటిలో 40,274 పురుషులకు, 4835 మహిళలకు కేటాయించారు.
పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారి నుంచి అక్టోబరు 27 నుంచి నవంబరు 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* పోస్టుల వివరాలు...
1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 20,765
2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 5914
3) సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169
4) సశస్త్ర సీమాబల్ (SSB): 2167
5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1787
6) అసోం రైఫిల్స్ (AR): 3153
7) సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 154
8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175
రాత పరీక్ష విధానం:
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవర్‌నెస్-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు కోత విధిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Nursing Jobs: జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత ఉన్న తెలంగాణ అభ్యర్థుల నుంచి రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్) దరఖాస్తులు కోరుతోంది. వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం మొదటి విడత ఎంపిక పూర్తికాగా.. డిసెంబర్ 27 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్ సెట్ - 2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా!
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
టీఎస్ సెట్-2022 పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..