ట్రావెల్, టూరిజం ఇండస్ట్రీ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అయితే, పర్యాటక రంగం రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కడంలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. సెర్చింగ్ లో సహాయపడే చాట్ బాట్ ల నుంచి మొదలు కొని షాపింగ్ కు ఉపయోగపడే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కొనుగోలుకు  విధానాన్ని మార్చే మెషీన్ లెర్నింగ్, ట్రాన్సిట్ చేసే మార్గాన్ని మార్చే ఫేషియల్ రికగ్నేషన్, ప్రయాణీకుల ఎక్స్ పీరియెన్స్, ట్రావెల్ సర్వీసులను మెరుగుపరిచే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ విశ్లేషణలు సహా ఎన్నో విధాలుగా టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ట్రావెల్ బ్లాగర్ల ప్రభావం పెరగడంతో, సోషల్ మీడియా టూరిస్టులకు పరిశోధనా స్థలంగా మారింది.  ట్రావెల్, టూరిజం సంబంధిత విషయాలను తెలుసుకోవడంలో టెక్నాలజీ చాలా ప్రభావాన్ని చూపిస్తోంది.  హోటల్, బస, ఆహారం, డ్రింక్స్, రవాణా, రియల్ ఎస్టేట్, ఫైనాన్సింగ్, లీజింగ్, బీమా అన్నీ టెక్నాలజీతో ముడిపడి ఉన్న అంశాలే. రోజు రోజుకు పెరుగుతున్ సాంకేతికత మూలంగా ఇవన్నీ మరింత అభివృద్ది చెందుతున్నాయి.

   


ట్రావెల్ యాప్స్


ట్రావెల్ యాప్స్ ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రవాణా బుకింగ్, అకామిడేషన్ బుకింగ్, నావిగేషన్/జియో-ట్రాకింగ్ సర్వీసులు, ట్రిప్ రివ్యూలు, మెసేజింగ్ సర్వీసులు, సోషల్ ఫీడ్, బ్యాంకింగ్,  పేమెంట్ ఇంటిగ్రేషన్ లాంటి వివరాలు ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది.


AI చాట్‌బాట్‌లు


ఇది బుకింగ్ ప్రక్రియతో పాటు వేగవంతమైన కస్టమర్ సర్వీస్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.  


వాయిస్ టెక్


ఎయిర్‌లైన్ టిక్కెట్స్, హోటల్ రూమ్స్ గురించి తెలుసుకోవడంతో పాటు బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.   ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారంలో మెరుగైన వాయిస్ రికగ్నిషన్‌ ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల కస్టమర్ లైఫ్‌ సైకిల్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగుపర్చుతోంది.   


కాంటాక్ట్‌ లెస్ టెక్


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం కాంటాక్ట్‌ లెస్‌ గా మారుతోంది. బయోమెట్రిక్ రికగ్నిషన్‌ తో చెక్ ఇన్ అయినా, క్యాష్ లెస్ చెల్లింపులు అయినా ఈజీగా చేసే అవకాశం కలుగుతోంది.


AR , VR


ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) కరోనా అనంతరం బాగా డెవలప్ అయ్యింది. టూరిస్టులు వారు సందర్శించాలనుకునే ప్రాంతాల గురించి AR , VR ద్వారా చూసే వెసులుబాటు కలుగుతోంది. అంతేకాదు, యాత్రికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి.


రోబోటిక్స్


కోవిడ్ తర్వాత టూరిజంలో సర్వీస్ రోబోల వినియోగడం బాగా పెరిగింది. విమానాశ్రయాలు, హోటల్స్ లో వీటి వినియోగం బాగా పెరిగింది.


ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)


IoT పరికరాలు పర్యాటకరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి.  ఆటోమేటెడ్ చెక్-ఇన్‌లతో పాటు హోటల్ గదులకు చెక్-అవుట్‌లను అనుమతిస్తున్నాయి. ఎయిర్‌ లైన్స్‌ లో RFIDతో స్మార్ట్ బ్యాగేజీ ట్రాకింగ్ చేస్తున్నాయి.  IoT అన్ని ప్రాంతాలలో స్మార్ట్ టూరిజంను ప్రోత్సహిస్తోంది.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI),  బిగ్ డేటా


AI, బిగ్ డేటా ప్రయాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మరింత సమర్థవంతంగా మెరుగుపర్చుతున్నాయి.  డిమాండ్, ,ధరల అంచనా, సిఫార్సు ఇంజిన్‌లు, గెస్ట్ ప్రొఫైలింగ్, రిసోర్స్ ప్లానింగ్, ఆప్టిమైజ్ కస్టమర్ సపోర్ట్, సోషల్ మీడియాలో సెంటిమెంట్ విశ్లేషణ లాంటి విషయాల్లో AI,  బిగ్ డేటా ఎంతో ఉపయోగపడుతోంది.   


క్లౌడ్ కంప్యూటింగ్


ట్రావెల్ కంపెనీలు స్టోరేజీ, అప్లికేషన్, సర్వర్‌ల వంటి ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ సేవలను పొందేందుకు క్లౌడ్ సొల్యూషన్‌లను అవలంభిస్తున్నాయి. మొత్తంగా టూరిజం ఇండస్ట్రీల్లో టెక్నాలజీ వినియోగం కారణంగా టూరిస్టులకు కావాల్సిన సమాచారం ఈజీగా లభిస్తోంది.