జపాన్‌లో నర్సింగ్ ఉద్యోగాలపై ఆసక్తి, అర్హత ఉన్న తెలంగాణ అభ్యర్థుల నుంచి రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్‌) దరఖాస్తులు కోరుతోంది. వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారికి శిక్షణ ద్వారా విదేశీ ఉద్యోగాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం మొదటి విడత ఎంపిక పూర్తికాగా.. డిసెంబర్ 27 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.


కాగా మరిన్ని ఉద్యోగాలున్నందున రెండో విడత దరఖాస్తులు ఆహ్వానించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామంది. జపనీస్ భాషపై శిక్షణతో పాటు ఇతర వృత్తిపరమైన నైపుణ్యాలను కల్పిస్తామని తెలిపింది. మరిన్ని వివరాల కోసం టామ్‌కామ్ వెబ్‌సైట్‌ను చూడాలని, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.


Website 


Also Read:


తెలంగాణలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సంక్షేమ వసతి గృహాల్లో 581 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు బీఈడీ/డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...