RRB JE CBT2 EXAM DATE: రైల్వేశాఖలో జూనియర్ ఇంజినీర్(JE), కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ (సీబీటీ-2) పరీక్ష తేదీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 22న నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను పరీక్షకు 10 రోజుల ముందుగా, అడ్మిట్‌కార్డులను 4 రోజుల ముందుగా విడుదల చేయనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.


ఇటీవలే సీబీటీ-1 ఫలితాలను విడుదల చేయగా సీబీటీ-2 పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ అయిన 20,792 మంది అభ్యర్థుల రోల్‌ నంబర్‌తో ఉన్న వివరాలను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి.


దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో ఖాళీల భర్తీకి గతేడాది జులై 30న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్‌ నంబర్‌ 03/ 2024) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతేడాది డిసెంబరులో సీబీటీ-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఆర్‌ఆర్‌బీ మార్చి 5న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా తర్వాతి దశ(సీబీటీ-2)కు మొత్తం 20,792 మంది అభ్యర్థుల ఎంపికయ్యారు. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్షను ఏప్రిల్ 22న నిర్వహించనున్నారు.  జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400; కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ పోస్టులకు రూ.44,900 జీతంగా చెల్లిస్తారు.  


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 7,951. 


⫸ జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు 


⫸ కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే): 17 పోస్టులు  


స్టేజ్‌-1 రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు స్టేజ్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.


స్టేజ్‌-2 రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు స్టేజ్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, ఫిజిక్స్ అండ్‌ కెమిస్ట్రీ 15 ప్రశ్నలు-15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ 10 ప్రశ్నలు-10 మార్కులు, టెక్నికల్ ఎబిలిటీస్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 


జీతం: 
➥జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400. 
➥ కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్: రూ.44,900. 


Notification