RRB JE Exam Date Released | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అభ్యర్థులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. RRB జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. జేఈతో పాటు అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్ పోస్టులకు నిర్వహించనున్న పరీక్షా తేదీలను ఆర్ఆర్‌బీ ప్రకటించింది. రైల్వేలో వివిధ పోస్టుల కోసం మొత్తం 7,951 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ సీబీటీ 1ను డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
- అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నవంబర్ 25, 2024 నుంచి నవంబర్ 29, 2024 వరకు సీబీటీ 1 ఎగ్జామ్ (Computer Based Test) నిర్వహించనున్నారు.
- ఆర్పీఎఫ్ ఎస్సై పోస్టులకు డిసెంబర్ 2, 2024 నుంచి డిసెంబర్ 5, 2024 వరకు పరీక్షలు ఉన్నాయి.
- ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ పోస్టులకు డిసెంబర్ 16, 2024 నుంచి డిసెంబర్ 26 వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు.
- జూనియర్ ఇంజినీర్ పోస్టులకుగానూ డిసెంబర్ 6, 2024 నుంచి డిసెంబర్ 13, 2024 తేదీల వరకు సీబీటీ 1 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
RRB JE పోస్టుల కోసం జూలై 30న దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. తప్పులు సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ గడువు సెప్టెంబర్ 8న ముగిసింది. RRB JE ఎగ్జామ్ రెండు దశలలో సీబీటీ1, సీబీటీ2గా జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులందరికీ వైద్య పరీక్ష (Medical Tests) నిర్వహిస్తారు. కాగా, రైల్వేలో పోస్టుల భర్తీకి పైన పేర్కొన్న పోస్టులతో పాటు కెమికల్ సూపర్‌వైజర్లు, రీసెర్చ్ పోస్టులు, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్ల కోసం ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేయండి
ఐటీబీపీ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
ITBP Constable Recruitment 2024: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మంగళవారం (అక్టోబర్ 8) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 6తో దరఖాస్తుల తుది గడువు ముగియనుంది. ఆన్ లైన్ విధానంలో అధికారిక వెబ్ సైట్ recruitment.itbpolice.nic.inలో అప్లై చేసుకోవాలని సూచించారు.