బ్యాంకు ఎగ్జామ్స్‌ ప్రిపేర్ అవుతున్న వాళ్లకు లక్కీ ఛాన్స్. ఆర్బీఐ బ్యాంక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెలలోనే నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.  


డిగ్రీ చేసిన అభ్యర్థుల నుంచి రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. 950 బ్యాంక్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. 


ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ ఉంచింది. ఫిబ్రవరి 17 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.  


విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసిన వాళ్లంతా ఈ ఉద్యోగాలకు అర్హులు


ముఖ్యమైన తేదీలు:


అప్లికేషన్ ప్రారంభం: 17ఫిబ్రవరి 2022
అప్లికేషన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 మార్చి 2022
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: 08 మార్చి 2022


ప్రి ఎగ్జామ్‌ డేట్: 26-27 మార్చి 2022


అప్లికేషన్ ఫీజు:


జనరల్‌/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌- రూ. 450
ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్/ మాజీ సైనికులు- రూ. 50


ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్, ఈ చలానా, నెట్‌ బ్యాంకింగ్ దేని ద్వారైనా ఈ ఫీజు చెల్లించవచ్చు. 


 వయోపరిమితి:


కనీస వయసు- 20ఏళ్లు 
గరిష్ట వయసు- 28 ఏళ్లు
కేంద్ర ప్రభుత్వం రూల్స్‌ ప్రకారం ఆయా కేటగిరిల వాళ్లకు వయసు సడలింపు ఉంటుంది. 


అభ్యర్థులు ముందుగా rbi.org.inలో లాగిన్‌ అవ్వాలి. అక్కడ హోమ్‌ పేజ్‌లో కనిపించే అప్లికేషన్ ఫర్‌ 950 అసిస్టెంట్ పోస్ట్స్‌పై క్లిక్‌ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే కొత్త పేజ్‌ ఓపెన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్‌లో అడిగిన వివరాలు నింపాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ నింపడం పూర్తైన తర్వాత ఫీజు పే చేసే ఆఫ్షన్‌పై క్లిక్ చేసి చెల్లింపులు పూర్తి చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఓ కాపీ ప్రింట్‌ తీసిపెట్టుకోవాలి.