Power Grid Corporation of India Limited Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (Junior Technician Trainee) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 203 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ(ITI-ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 12 వరకు కొనసాగనుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.18,500 స్టైపెండ్‌గా ఇస్తారు. తదనంతరం నెలకు రూ.21,500-రూ.74000 పే స్కేల్ అమలుచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 203


* జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు


➥ నార్తర్న్ రీజియన్-I(NR-I): 15 పోస్టులు
అధికారిక పరిధి: ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో కొంత భాగం, హర్యానాలో కొంత భాగం, ఉత్తరాఖండ్‌.


➥ నార్తర్న్ రీజియన్-II(NR-II): 30 పోస్టులు
అధికారిక పరిధి: హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కొంత భాగం, జమ్మూ & కశ్మీర్, లడఖ్, చండీగఢ్.


➥ నార్తర్న్ రీజియన్-III(NR-III): 45 పోస్టులు 
అధికారిక పరిధి: ఉత్తరాఖండ్‌లో కొంత భాగం, ఉత్తరప్రదేశ్‌లో కొంత భాగం, మధ్యప్రదేశ్‌లో కొంత భాగం.


➥ ఈస్టర్న్ రీజియన్-I (ER-I): 08 పోస్టులు
అధికారిక పరిధి: బిహార్, జార్ఖండ్. 


➥ ఈస్టర్న్ రీజియన్-I (ER-II): 10 పోస్టులు
అధికారిక పరిధి: బిహార్, జార్ఖండ్.  


➥ నార్త్-ఈస్టర్న్ రీజియన్-I (NER): 40 పోస్టులు
అధికారిక పరిధి: అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర.


➥ సదరన్ రీజియన్-I (SR-I): 20 పోస్టులు
అధికారిక పరిధి: అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కొంత ప్రాంతం.


➥ సదరన్ రీజియన్-II (SR-II): 30 పోస్టులు
అధికారిక పరిధి: కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొంత ప్రాంతం.


➥ వెస్ట్రర్న్ రీజియన్-II (WR-II): 05 పోస్టులు
అధికారిక పరిధి: కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొంత ప్రాంతం.

అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 12.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.18,500 స్టైపెండ్‌గా ఇస్తారు. తదనంతరం నెలకు రూ.21,500-రూ.74000 పే స్కేల్ అమలుచేస్తారు.


PGCIL జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఆన్‌లైన్ దరఖాస్తు ఇలా..


➥ ఆన్‌లైన్ ఖాళీ దరఖాస్తు ఫారమ్‌ను దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవాలి.


➥ అర్హతలు, ID ప్రూఫ్, చిరునామా వివరాలు, ప్రాథమిక వివరాలు వంటి అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి.


➥ ఫోటో, సైన్, ID ప్రూఫ్, మొదలైన దరఖాస్తు ఫారమ్‌కు సంబంధించిన స్కాన్ చేసిన పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి.


➥ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు ప్రివ్యూ, అన్ని కాలమ్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.


➥  ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటే, దాని ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించాలి.


➥ ఆపై దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి & ఫైనల్ సమర్పించిన ఫారమ్ నుండి ప్రింట్ తీసుకోవాలి.


ముఖ్యమైన తేదీలు..


➦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.11.2023.


➦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 12.12.2023.


➦ పరీక్ష తేదీ: జనవరి 2024


➦ అడ్మిట్ కార్డ్: త్వరలో అందుబాటులో ఉంటుంది.


Notification


Website


                                 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply