NEFR Sports Quota Recruitment: గువాహటి మాలిగావ్‌లోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వివిధ క్రీడాంశాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్‌ఎఫ్‌ఆర్ డివిజన్: మాలిగావ్, కతిహార్, అలీపుర్దువార్, రంగియా, లుమ్డింగ్, టిన్సుకియా.
వివరాలు..
మొత్తం ఖళీలు: 51
* స్పోర్ట్స్ పర్సన్ పోస్టులు
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, క్రికెట్, క్రికెట్, బాక్సింగ్, పవర్ లిఫ్టింగ్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్.
అర్హత: 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్. సైనికులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత చిరునామాకు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపాలి.
చిరునామా: Senior Personnel Officer (Recruitment),
North East Frontier Railway HQ,
Maligaon, Guwahati – 781011.
ఎంపిక విధానం: ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్, విద్యార్హత తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.10.2023.
ALSO READ:
ఎస్‌బీఐలో 2000 పీవో పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
భారతదేశ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 7న ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు గడువు సెప్టెంబరు 27తో ముగియాల్సి ఉండగా.. అక్టోబరు 3 వరకు పొడిగించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
పీవో పోస్టుల దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులు - వివరాలు ఇలా
పశ్చిమబెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. స్కిల్‌టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..