NIMS Staff Nurse Posts: నిజాం ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్(NIMS)లో స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 25న విడుదల నిమ్స్ అధికారులు విడుదల చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను నిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మొత్తం 300 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసింది. స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మార్చి 4లోపు నిమ్స్‌ ప్రాంగణంలోని పాత ఓపీ బ్లాక్‌లో ఉన్న మొదటి అంతస్తులోని హెచ్‌ఆర్-1 సెక్షన్‌లో రిపోర్టు చేయాలని ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. 


నిమ్స్ స్టాఫ్‌నర్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..



ALSO READ:


గురుకుల టీజీటీ మెరిట్‌ జాబితా విడుదల, ధ్రువపత్రాల పరిశీలన ఎప్పుడంటే?
తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలను గురుకుల నియామక బోర్డు(TREI-RB) ఫిబ్రవరి 25న విడుదల చేసింది. ఇందులో బయోలజికల్ సైన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సంస్కృతం, సోషల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు ఎంపికైన టీజీటీ అభ్యర్థుల వివరాలు ఉన్నాయి, అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాలు అందుబాటులో ఉంచింది. ఎంపికైనవారికి ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆదివాసీ కొమ్రం భీమ్ భవన్, బంజారా భవన్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ
తెలంగాణ‌ ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎస్సీ స్టడీ సర్కిళ్లలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతోపాటు.. బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిగ్రీ అర్హత ఉండి, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఉచిత స్టడీ మెటీరియల్‌ కూడా సమకూరుస్తారు. మరిన్ని వివరాల కోసం 040-23546552 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ప్రతి జిల్లాశాఖకు 100 సీట్ల చొప్పున ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 75%, ఎస్టీలకు 10%, బీసీ/ మైనారిటీలకు 15% సీట్లు కేటాయించారు. ఏదైనా డిగ్రీ {బీఏ/ బీకామ్/ బీఎస్సీ/ బీటెక్/ బీఫార్మసీ/ బీఎస్సీ (అగ్రికల్చర్)} ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గతంలో 5 నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తిచేసినవారు అనర్హులు. ఉద్యోగం చేస్తున్నవారు లేదా పైతరగతులు చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అనర్హులు.
దరఖాస్తు, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...