AP Skill Development Case: సుప్రీంకోర్టులో సోమవారం (ఫిబ్రవరి 26న) ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణకు రానుంది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ గతంలోనే దాఖలైంది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబుకు బెయిల్ రద్దు పిటిషన్‌ను సోమవారం విచారించనుంది.
సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 12 ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా ధర్మాసనం రెండు వారాలకు (ఫిబ్రవరి 26కు) వాయిదా వేసింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది. దీని తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాససనం నేడు చేపట్టనుంది. రెండు వారాల కిందట జరిగిన విచారణలో భాగంగా న్యాయవాది హరీష్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల నేడు కోర్టుకు రాలేక పోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. అందుకే ఈ కేసును 3 వారాలపాటు వాయిదా వేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ తరపు న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. వీలయినంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణ చేపట్టనుంది.
ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ ను గతేడాది వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో అరెస్టు కాగా, ఏపీ హైకోర్టు నవంబరులో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తొలుత తాత్కాలిక బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.