NLC Recruitment: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాల్లోని నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన తలబిరా ప్రాజెక్టులో ఇండస్ట్రియల్ వర్కర్‌, క్లరికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 34 పోస్టులను భర్తీ చేయనున్నారు.పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా డిగ్రీ ఉత్తీ్ర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 34


పోస్టుల వారీగా ఖాళీలు..


⏩ ఇండస్ట్రియల్ వర్కర్‌ (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌): 01 పోస్టు


అర్హత:12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఇండస్ట్రియల్ వర్కర్‌ (ఎలక్ట్రీషియన్‌): 03 పోస్టులు


అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఇండస్ట్రియల్ వర్కర్‌ (ఫిట్టర్‌): 02 పోస్టులు


అర్హత:12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఇండస్ట్రియల్ వర్కర్‌ (మెకానిక్‌- మోటర్‌ వెహికిల్‌): 02 పోస్టులు


అర్హత:12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ ఇండస్ట్రియల్ వర్కర్‌ (వైర్‌మ్యాన్‌):  01  పోస్టు


అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ క్లరికల్‌ అసిస్టెంట్: 17 పోస్టులు


అర్హత:ఏదైనా ఫుల్ టైమ్ ఉత్తీ్ర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 30 సంవత్సరాలు,ఓబీసీ(ఎస్‌సీఎల్)- 33 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ- 35 సంవత్సరాలు మించకూడదు. 


⏩ జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 05 పోస్టులు


అర్హత: సివిల్ / సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల వ్యవధి ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: యూఆర్/ఈడబ్ల్యూఎస్- 30 సంవత్సరాలు,ఓబీసీ(ఎస్‌సీఎల్)- 30 సంవత్సరాలు, ఎస్సీ- 30 సంవత్సరాలు, ఎస్టీ- 35 సంవత్సరాలు మించకూడదు. 


⏩ జూనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌): 02 పోస్టులు


అర్హత:మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల వ్యవధి ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


⏩ జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 01 పోస్టు


అర్హత: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కనీసం 3 సంవత్సరాల వ్యవధి ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


వేతనం: జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.38,000. క్లరికల్‌ అసిస్టెంట్, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టులకు రూ.30,000 ఉంటుంది.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


పరీక్షా విధానం: 


➥ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు- మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్‌నెస్‌కు 30 మార్కులు, సబ్జెక్ట్ నాలెడ్జ్‌కు 70 మార్కులు.


➥ క్లరికల్‌ అసిస్టెంట్, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టులకు-  మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్‌నెస్‌కు 100 మార్కులు.


పరీక్షా సమయం:  రాత పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నాపత్రం ఆంగ్ల భాషలో మాత్రమే ఉంటుంది.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 24.04.2024.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..