నవోదయ విద్యాలయ సమితి టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7,629 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పీజీటీ, టీజీటీ టీచింగ్ పోస్టులతోపాటు, పలు విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. జులై మొదటివారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


1) పీజీటీ (కంప్యూటర్ సైన్స్): 306 పోస్టులు


అర్హత: ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంటెక్(సీఎస్)తోపాటు బీఈడీ ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి.


2) పీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్): 91 పోస్టులు


అర్హత: ఎంపీఈడీ ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి.


3) పీజీటీ (మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్): 46 పోస్టులు


అర్హత: బీఈడీతోపాటు సంబంధిత సబ్జెకులో పీజీ డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి.


4) టీజీటీ (కంప్యూటర్ సైన్స్): 649 పోస్టులు


అర్హత: బీసీఏ/బీఎస్సీ (సీఎస్)/బీటెక్(సీఎస్/ఐటీ)తోపాటు బీఈడీ, సీటెట్ అర్హత ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


5) టీజీటీ (ఆర్ట్): 649 పోస్టులు


అర్హత: డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్)తోపాటు బీఈడీ అర్హత ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. 


6) టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్): 1244 పోస్టులు


అర్హత: బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


7) టీజీటీ (మ్యూజిక్): 649 పోస్టులు 


అర్హత: డిగ్రీ (మ్యూజిక్).


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


8) స్టాఫ్ నర్స్: 649 పోస్టులు


అర్హత: బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


 9) క్యాటరింగ్ సూపర్‌వైజర్: 637 పోస్టులు 


అర్హత: డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) లేదా ఐటీఐ సర్టిఫికేట్‌తోపాటు పదేళ్ల అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


10) ఆఫీస్ సూపరింటెండెంట్: 594 పోస్టులు


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


11) ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 598 పోస్టులు 


అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి.


12) మెస్ హెల్పర్: 1297 పోస్టులు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


13) అసిస్టెంట్ కమిషనర్ (అకడమిక్): 49 పోస్టులు


అర్హత: 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ ఉండాలి. ప్రిన్సిపల్‌గా కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి.


14) అసిస్టెంట్ కమిషనర్ (ఫైనాన్స్): 02 పోస్టులు


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


15) ఎగ్జి్క్యూటివ్ ఇంజినీర్: 02


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


16) సెక్షన్ ఆఫీసర్ (అకడమిక్): 18 పోస్టులు


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


17) సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 11 పోస్టులు


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


18) లీగల్ అసిస్టెంట్: 01


అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.


19) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 55 పోస్టులు


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 23 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి.


20) పర్సనల్ అసిస్టెంట్: 25 పోస్టులు


అర్హత: వర్తించదు.


వయోపరిమితి: వర్తించదు.


21) కంప్యూటర్ ఆపరేట్: 08 పోస్టులు 


అర్హత: బీసీఏ/బీఎస్సీ/బీటెక్ (సీఎస్/ఐటీ) ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


22) స్టెనోగ్రాఫర్: 49 పోస్టులు


అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.


వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై, 2023.


Website


                                   


ALSO READ:


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..