NVS Non Teaching Notification: ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో నాన్-టీచింగ్ (గ్రూప్-బి, గ్రూప్-సి) పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ద్వారా, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు. 


వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి నోటిఫికేషన్‌ను మాత్రమే అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలను, ముఖ్యమైన తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు.


వివరాలు..


* నాన్-టీచింగ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 1377.


➥ స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు
అర్హత: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ నర్సింగ్. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్‌గా లేదా నర్స్ మిడ్ వైఫ్ సభ్యత్వం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.44,900-రూ.1,42,400.


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ సంబంధిత విభాగాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 23 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.


➥ ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
అర్హత: బీకామ్ డిగ్రీతోపాటు అకౌంటింగ్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.


➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్/హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు (హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి)/ఇంగ్లిష్ నుంచి హిందీలోకి) కోర్సు చేసి ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: రూ.35,400-రూ.1,12,400.


➥ లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: లా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల లా ప్రాక్టీస్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.35,400-రూ.1,12,400.


➥ స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్ తెలిసి ఉండాలి. డిక్టేషన్‌లో 10 నిమిషాల్లో 80 పదాలు, ట్రాన్‌స్క్రిప్షన్‌ - ఇంగ్లిష్ 50 నిమిషాలు, హిందీ 65 నిమిషాలు ఉంటుంది. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.


➥ కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు
అర్హత: బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) (లేదా) బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ).
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.


➥ కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోటల్ మేనేజ్‌మెంట్) (లేదా) ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే ట్రేడ్ ప్రొఫీషియన్సీ సర్టిఫికేట్(కేటరింగ్)తోపాటు డిఫెన్స్ సర్వీసెస్‌లో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. 
జీతం: రూ.25,500-రూ.81,100.


➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.


➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు
అర్హత: ఇంటర్ విద్యార్హత ఉండాలి. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. (లేదా) ఇంటర్‌తోపాటు సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.


➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ (ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్) ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.19,900-రూ.63,200.


➥ ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతోపాటు డిప్లొమా/సర్టిఫికేట్(ల్యాబొరేటరీ టెక్నిక్) కోర్సు చేసి ఉండాలి. (లేదా) ఇంటర్ అర్హత ఉండాలి.  
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.


➥ మెస్ హెల్పర్: 442 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల మెస్‌లలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్‌వీఎస్ స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణులు కావాలి.
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.


➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. 
వయోపరిమితి: 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: రూ.18,000-రూ.56,900.


వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం. 


Website