పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ), వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన లేదా పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


ఖాళీల వివరాలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2): 24 పోస్టులు 

విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్‌ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్‌ మేనేజ్‌మెంట్, సైన్సెస్.

అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. విదశాల్లో ఉంటున్న భారతీయులైతే రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా.


జీతం: రూ.70,900.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.10.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీ సమర్పణకు చివరితేది: 20.11.2023.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, National Institute of
Technology Andhra Pradesh, Kadak
atla, Tadepalligudem - 534101, West Godavari,
Andhra Pradesh, India.


Notification


Online Application


Website


ALSO READ:


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 496 పోస్టులని భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (ఫిజిక్స్‌/ మ్యాథ్స్‌) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీటీ, వాయిస్‌ టెస్ట్‌, సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్స్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..