NABARD Assistant Manager Notification: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్-NABARD) దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించి ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది. సంస్థ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. రెండు దశల రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ) (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్/ రాజ్‌భాష) పోస్టులు
ఖాళీల సంఖ్య: 102.
పోస్టుల కేటాయింపు: యూఆర్ - 46, ఎస్సీ - 11, ఎస్టీ - 10, ఓబీసీ - 26, ఈడబ్ల్యూఎస్ - 09.
విభాగాల వారీగా ఖాళీలు..
➥ జనరల్: 50 పోస్టులు
➥ చార్టర్డ్ అకౌంటెంట్: 04 పోస్టులు
➥ ఫైనాన్స్: 07 పోస్టులు
➥ కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 16 పోస్టులు
➥ అగ్రికల్చర్: 02 పోస్టులు
➥ యానిమల్ హస్బెండరీ: 02 పోస్టులు
➥ ఫిషరీస్: 01 పోస్టు
➥ ఫుడ్ ప్రాసెసింగ్: 01 పోస్టు
➥ ఫారెస్ట్రీ: 02 పోస్టులు
➥ ప్లాంటేషన్ & హార్టికల్చర్: 01 పోస్టు
➥ జియో ఇన్ఫర్మేటిక్స్: 01 పోస్టు
➥ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్: 03 పోస్టులు
➥ స్టాటిస్టిక్స్: 02 పోస్టులు
➥ సివిల్ ఇంజినీరింగ్: 03 పోస్టులు
➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 01 పోస్టు
➥ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ సైన్స్: 02 పోస్టులు
➥ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్: 02 పోస్టులు
➥ రాజ్‌భాష: 02 పోస్టులు
ALSO READ: 'స్టెనోగ్రాఫర్' నోటిఫికేషన్ విడుదల, 2006 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 % మార్కులతో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1994 - 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.150. ఇతరులకు రూ.850. స్టాఫ్‌కి దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష విధానం: మొత్తం మార్కులకు 200 ప్రలిమినరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, డెసిషన్ మేకింగ్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఎకానమీ & సోషల్ ఇష్యూస్ 40 ప్రశ్నలు-40 మార్కులు, అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్ 40 ప్రశ్నలు-40 మార్కులు. హిందీ/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ (ఆన్‌లైన్ డిస్క్రిప్టివ్) 100 మార్కులకు ఉంటుంది. పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్‌లో కీబోర్డు ద్వారా రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. పేపర్-2 ఎకనామిక్స్ & సోషల్ ఇష్యూస్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 30 ప్రశ్నలకు 50 మార్కులు- 30 నిమిషాలు ఆబ్జెక్టివ్ తరహా, 4 డిస్ట్రిప్టివ్ ప్రశ్నలకు 50 మార్కులు - 90 నిమిషాలు ఉంటాయి.
జీతం: నెలకు రూ.44,500 - రూ.89,150.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.08.2024.
➥ ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01.09.2024.