తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా నియమితులైన 1362 మంది జూనియన్ లైన్‌మెన్లకు శనివారం (సెప్టెంబరు 30న) రాత్రి హైదరాబాద్‌లోని జెన్‌కో ఆడిటోరియంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో 35,774 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 10,312, ట్రాన్స్‌కోలో 4403, జెన్‌కోలో 3,689, ఎన్‌పీడీసీఎల్‌లో 4,370 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. ఇక 13 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
జూనియర్ లైన్‌మెన్లుగా ఆరుగురు మహిళలు..
జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు ఎంపికైనవారిలో ఆరుగురు మహిళలు ఉండటం విశేషం. గత నోటిఫికేషన్‌లో ఒకే మహిళ ఎంపిక కాగా.. ఈసారి ఆరుగురు కొలువులు సాధించారు. స్తంభాలు ఎక్కే క్లిష్టమైన పరీక్షను అధిగమించి ఉద్యోగాలకు ఎంపికయ్యారంటూ మంత్రి వారిని అభినందించారు.
ALSO READ:
అంగన్వాడీ టీచర్లకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్, పీఆర్సీ అమలుకు నిర్ణయం
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను ఆదివారం (అక్టోబరు 1) మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంస్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..