కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 677
1) సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్: 362 పోస్టులు (ఏపీ-05, తెలంగాణ-07)
2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్: 315 పోస్టులు (ఏపీ-10, తెలంగాణ-10)
అర్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 సంవత్సరాలలోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యరులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం:
టైర్-1 పరీక్ష: మొత్తం 100 మార్కులకు టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ అవేర్‌నెస్-40 మార్కులు-40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, న్యూమరికల్/అనలిటికల్/లాజికల్ ఎబిలిటీ & రీజనింగ్-20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిస్ లాంగ్వేజ్-20 ప్రశ్నలు-20 మార్కులు, పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు (ఒక గంట).
టైర్-2 పరీక్ష (ఎస్ఏ/ఎంటీ): మొత్తం 50 మార్కులకు టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షకు ఎలాంటి నిర్దిష సమయమంటూ లేదు. కనీస అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అలాగే ఎంటీఎస్ పోస్టులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్) నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీస అర్హత మార్కులను 20 శాతంగా నిర్ణయించారు.
జీతం: సెక్యూరిటీ అసిస్టెంట్/మోటాన్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.18,000 - రూ.56,900 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.
ALSO READ:
ఎన్టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు, ఇంజినీరింగ్‌తోపాటు ఈ అర్హతలుండాలి
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) గేట్-2023 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 495 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2023 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..