IBPS SO Mains Admitcard: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డు(కాల్ లెటర్)లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచింది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 28న ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్ష కాల్ లెటర్ల కోసం క్లిక్ చేయండి..
మెయిన్ పరీక్ష ఇలా..
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐబీపీఎస్ పరీక్షల క్యాలెండర్ విడుదల..
ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజాగా విడుదల చేసింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఈ ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో(RRB) ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులను; అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయంది.
ప్రకటించిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం..
➥ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష; ఆఫీసర్ స్కేల్-1 మెయిన్ పరీక్ష సెప్టెంబరు 29న, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను అక్టోబరు 6న ఐబీపీఎస్ నిర్వహించనుంది. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 29న నిర్వహించనుంది.
➥ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 24, 25;, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 13న మెయిన్ పరీక్ష ఉండనుంది.
➥ ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అక్టోబరు 19, 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 30న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నంబరు 9న ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరు 14న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించనుంది.
పరీక్ష పేరు | తేదీలు |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ | 03.08.2024, 04.08.2024, 10.08.2024, 17.08.2024 & 18.08.2024 |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ | 29.09.2024 |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ | 29.09.2024 |
ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ | 06.10.2024 |
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ | 24.08.2024, 25.08.2024, 31.08.2024 |
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ | 13.10.2024 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 19.10.2024, 20.10.2024 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 30.11.2024 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 09.11.2024 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 14.12.2024 |