Indian Navy Chargeman INCET 01/2024 Recruitment: ఇండియన్ నేవీ- సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ (INCET-01/2024) నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిద్వారా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో మొత్తం 741 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కర్, కుక్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 20న ప్రారంభంకాగా.. ఆగస్టు 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

పోస్టుల వారీగా 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల పరిశీలన ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తుది ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/ 2024)

ఖాళీల సంఖ్య: 741 పోస్టులు

I. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్

ఖాళీల సంఖ్య: 33

➥ ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్): 01 పోస్టు

➥ ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ): 10 పోస్టులు

➥ ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్): 18 పోస్టులు

➥ సైంటిఫిక్ అసిస్టెంట్: 04 పోస్టులు

జీత భత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400.

II. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’, నాన్ గెజిటెడ్, నాన్-ఇండస్ట్రియల్

ఖాళీల సంఖ్య: 708

➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌): 02 పోస్టులు
జీత భత్యాలు: నెలకు రూ.25,500-రూ.81,100.

➥ ఫైర్‌మ్యాన్: 444 పోస్టులు
జీత భత్యాలు: రూ.19,900-రూ.63.200.

➥ ఫైర్ ఇంజిన్ డ్రైవర్: 58 పోస్టులు
జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.

➥ ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 161 పోస్టులు
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.

➥ పెస్ట్ కంట్రోల్ వర్కర్: 18 పోస్టులు
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.

➥ కుక్: 09 పోస్టులు
జీత భత్యాలు: రూ.19,900-రూ.63,200.

➥ ఎంటీఎస్‌ (మినిస్టీరియల్): 16 పోస్టులు 
జీత భత్యాలు: రూ.18,000-రూ.56,900.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి.. 

పోస్టులు వయోపరిమితి (02.08.2024 నాటికి)
ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్)  
18 - 25 సంవత్సరాలు
 
ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ)
ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్)  30 సంవత్సరాలకు మించకూడదు

సైంటిఫిక్ అసిస్టెంట్
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌)  18 - 25 సంవత్సరాలు
ఫైర్‌మ్యాన్  
 18 - 27 సంవత్సరాలు


ఫైర్ ఇంజిన్ డ్రైవర్
ట్రేడ్స్‌మ్యాన్ మేట్  18 - 25 సంవత్సరాలు
 
పెస్ట్ కంట్రోల్ వర్కర్
కుక్
మల్టీటాస్కింట్ స్టాఫ్ ఎంటీఎస్‌ (మినిస్టీరియల్)

వయోసడలింపు: నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మిలిటరీ సర్వీసుతోపాటు 3 సంవత్సరాలు, స్పోర్ట్స్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీలకు 10 సంవత్సరాలు), డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల వరకు (ఎస్సీ, ఎస్టీలకు 45 సంవత్సరాల వరకు) వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.295. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.08.2024.

Notification

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...