న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్(ఎన్ఐఎంఆర్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 79 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు.

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 79 

1) టెక్నికల్‌ అసిస్టెంట్(టీఏ): 26 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-13, ఎస్సీ-04, ఎస్టీ-01, ఓబీసీ-06, ఈడబ్ల్యూఎస్-02.

విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-01, ఎంఎల్‌టీ-06, లైఫ్ సైన్సెస్-17, వెటర్నరీ సైన్సెస్-01, ఫార్మా-01.

అర్హతలు..


➥ టీఏ (ఈఈ) పోస్టులకు ప్రథమ శ్రేణిలో ఇంజినీరింగ్ డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా బీఈ/బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్).


➥ టీఏ (ఎంఎల్‌టీ) పోస్టులకు బీఎస్సీ (ఎంఎల్‌టీ). 


➥ టీఏ (ఎల్‌ఎస్) పోస్టులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, వైరాలజీ, మాలిక్యూలర్ బయాలజీ, ఇమ్యూనాలజీ, పారాసైటాలజీ.. వీటిల్లో ఏదైనా సబ్జెక్టుతో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.


➥ టీఏ (వీఎస్) పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ (బీవీఎస్సీ) ఉండాలి. 


➥ టీఏ (ఫార్మా) పోస్టులకు ప్రథమశ్రేణిలో బ్యాచిలర్స్ డిగ్రీ (బీఫార్మసీ) ఉండాలి. 


వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.


2) టెక్నీషియన్‌-1: 49 పోస్టులు


పోస్టుల కేటాయింపు: జనరల్-22, ఎస్సీ-05, ఎస్టీ-03, ఓబీసీ-14, ఈడబ్ల్యూఎస్-05.


విభాగాలవారీగా ఖాళీలు:  లైఫ్ సైన్సెస్-40, కంప్యూటర్ సైన్స్-09


అర్హతలు..


➥ టెక్ (ఎల్‌ఎస్) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(సైన్స్) ఉత్తీర్ణత మరియి ఒక సంవత్సరం డిప్లొమా(మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీ) ఉండాలి.


➥ టెక్ (సీఎస్) పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(సైన్స్) ఉత్తీర్ణత మరియి ఒక సంవత్సరం డిప్లొమా(కంప్యూటర్) ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలలోపు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.19,900-రూ.63,200 వరకు చెల్లిస్తారు.


3) ల్యాబొరేటరీ అటెండెంట్‌-1: 04 పోస్టులు


పోస్టుల కేటాయింపు: జనరల్-02, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01.


అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50 శాతం మార్కులతో పదవతరగతితో పాటు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.  


వయోపరిమితి: 25 సంవత్సరాలలోపు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.18,000-రూ.56,900 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు ఫీజు: రూ.300.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 21.07.2023.


Notification


Website




ALSO READ:


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial