ఇండియన్ ఆర్మీ 62వ, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్‌/ ఏదైనా విభాగంలో డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 20 నుంచి జులై 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు ఏప్రిల్ 2024లో తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రారంభం కానుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 196.


1. 62వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) పురుషులు: 175 


ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్.


2. 33వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) మహిళలు: 19 


ఇంజినీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్.


3. ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ టెక్: 01 


4. ఎస్‌ఎస్‌సీ డబ్ల్యూ నాన్-టెక్: 01 


అర్హత: బీఈ, బీటెక్‌/ ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01-04-2024 నాటికి 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


పే స్కేల్:  రూ.56100- 177500.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.07.2023.


➥ కోర్సు ప్రారంభం: ఏప్రిల్ 2024.


Notification


Website


Also Read:


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


హమిర్‌పూర్‌ నిట్‌లో 84 నాన్‌టీచింగ్‌ పోస్టులు, వివరాలు ఇలా!
హమిర్‌పూర్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సీనియర్‌ సెకండరీ(10+2), ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ కేజీబీవీల్లో 1,241 ఉద్యోగాలు, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జూన్ 16న ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో స్పెషల్‌ ఆఫీసర్‌, సీఆర్‌టీల ఖాళీలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..