Trains Cancelled: ఒడిశా ఖరగ్ పూర్ -భద్రక్ సెక్షన్లో ఇటీవల రైలు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బహనాగ బజార్ స్టేషన్ లో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఈక్రమంలోనే బుధ, గురు వారాల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 21వ తేదీన 18045 (షాలీమార్ - హైదరాబాద్), 18046(హైదరాబాద్ - షాలీమార్), 22864 (ఎస్ఎంవీటీ బెంగళూర్ - హౌరా), 22826 (చెన్నై సెంట్రల్ - షాలీమార్), 12773 (షాలీమార్ - సికింద్రాబాద్), 22831 (హౌరా - శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం), 22849 (షాలీమార్ - సికింద్రాబాద్), 22842(తాంబరం - సంత్రాగచ్చి), 12868 (పుదుచ్చేరి - హౌరా) రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. అలాగే 22వ తేదీన అంటే గురువారం రోజు 22808(చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి), 22644(పాట్నా - ఎర్నాకులం), 22888(ఎస్ఎంవీటీ బెంగళూరు - హౌరా) రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులంతా గమనించి రైలు ప్రయాణం చేయాలని సూచించారు.  


ఈనెల 25 వరకు మరికొన్ని రైళ్లు రద్దు


ఇటీవలే జూన్ 19వ తేదీ అంటే ఈరోజు నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆదివారం వెల్లడించారు. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు సర్వీసులు అందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... గుంతకల్ - బోధన్ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ జంట నగరాల్లో 23 ఎంఎంీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తుండగా... ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. 


రద్దైన రైళ్ల వివరాలు ఇవే..!


07753 నెంబర్ గల కాజీపేట - డోర్నకల్, 07754 నెంబర్ డోర్నకల్ - కాజీపేట, 07755 నెంబర్ డోర్నకల్ - విజయవాడ, 07278 నెంబర్ భద్రాచలం - విజయవాడ, 07979 నెంబర్ విజయవాడ - భద్రాచలం, 07591 నెంబర్ సికింద్రాబాద్ - వికారాబాద్, 07592 నెంబర్ వికారాబాద్ - కాచీగూడ, 07463 నెంబర్ వరంగల్ - హైదరాబాద్, 077666 నెంబర్ సిర్పూర్ టౌన్ - కరీంనగర్ రైళ్లను ఈరోజు నుంచి 25 తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 07765 నెంబర్ కరీంనగర్ - సిర్పూర్ టౌన్, 07893 నెంబర్ నిజామాబాద్ - కరీంనగర్ రైళ్లను 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 07894 నెంబర్ గల కరీంనగర్ - నిజామాబాద్, 07751 నెంబర్ వాడి - కాచిగూడ, 07752 నెంబర్ ఫలక్ నుమా - వాడి, 17003 నెంబర్ కాజీపేట - సిర్పూర్ టౌన్, 17004 నెంబర్ బాల్ హార్షా- కాజీపేట, 17034 నెంబర్ సిర్పూర్ టౌన్ - భద్రాచలం, 17035 నెంబర్ కాజీపేట - బాల్ హార్షా రైళ్లను ఈరోజు నుంచి 25వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు. 17033 నెంబర్ భద్రాచలం - బాల్ హార్షా, 17036 నెంబర్ బాల్ హార్షా - కాజీపేట రైళ్లను 20వ తేదీ నుంచి 26 వరకు రద్దు చేశారు. ఇవే కాకుండా 07596 కాచీగూడ - నిజామాబాద్, 07593 నెంబర్ నిజామాబాజ్ -కాచీగూడ, 07853 నెంబర్ నిజామాబాద్ - నాందేడ్, 07791 నెంబర్ కాచీగూడ - నడికూడే, 07792 నెంబర్ నడికూడే - కాచీగూడ రైళ్లను కూడా 25వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు. 07854 నెంబర్ గల నాందేడ్ - నిజామాబాద్ రైలను నిన్నటి నుంచి 25 వ తేదీ వరకు క్యాన్సిల్ చేశారు.