వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6932 ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబర్ 16న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ప్రాథమిక పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ నవంబర్ 2న ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టినతేది వివరాలు నమోదు చేసి ఫలితాలను చూడవచ్చు. నవంబరు 9 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇలా చెక్ చేయండి..
➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట ఐబీపీఎస్ వెబ్‌సైట్ సందర్శించాలి.
➥ అక్కడ హోంపేజీలో కనిపించే ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ ఫలితాల కోసం CRP PO/MT-XII results లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అవసరమైన వివరాలు నమోదు చేసి సమర్పించాలి.
➥ అభ్యర్థుల స్కోర్ వివరాలతో కూడిన ఫలితాలు కనిపిస్తాయి. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
IBPS PO Results: ఐబీపీఎస్ పీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మెయిన్స్ పరీక్ష విధానం:
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ | 45 | 60 | 60 నిమిషాలు |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ | 40 | 40 | 35 నిమిషాలు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 నిమిషాలు |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ | 35 | 60 | 45 నిమిషాలు |
మొత్తం | 155 | 200 | 3 గంటలు |
IBPS PO పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం : 02.08.2022
ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది : 22.08.2022
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్/అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : అక్టోబర్ 2022.
ప్రిలిమినరీ పరీక్ష : అక్టోబరు 2022.
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ : నవంబరు 2022.
మెయిన్ ఎగ్జామ్ ఫలితాలు : డిసెంబరు 2022.
ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్ : జనవరి/ఫిబ్రవరి 2023.
ఇంటర్వ్యూ : జనవరి/ఫిబ్రవరి 2023
నియామకం : ఏప్రిల్ 2023.
Also Read:
IBPS Jobs: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 710 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండుదశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 1 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Bank Jobs: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ పోస్టులు, వివరాలు ఇలా!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఒప్పంద ప్రాతిపదికన ఆప్కాబ్ శాఖల్లో బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 7లోపు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని, దరఖాస్తు నింపిన తర్వాత నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..