ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 92 పోస్టులకు అక్టోబరు 1న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే నవంబరు 2 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అనుమతి ఇచ్చింది. అయితే ఈ గడువును పొడగిస్తూ తాజాగా కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నవంబరు 5 వరకు దరఖాస్తు గడువును పొడగించింది. అభ్యర్థులు నవంబరు 4న రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి నవంబరు 2తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే మరో 3 రోజులపాటు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.


ఇదిలా ఉండగా.. 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని ఏపీపీఎస్సీ తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న 'గ్రూప్-1' స్క్రీనింగ్ పరీక్షను, వచ్చే ఏడాది మార్చి రెండో వారంలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. 


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


గ్రూప్-1' నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 



పరీక్ష విధానం..


ప్రిలిమినరీ పరీక్ష: 
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.   ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు. 


ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.


మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.


మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.



Also Read:


APPSC: వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు, పరీక్షల షెడ్యూలు ఇదే!
ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నవంబరు 3 నుంచి 7 వరకు నిర్వహించనున్న రాతపరీక్షల హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పలు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందుకుగాను అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. అన్ని పోస్టుల భర్తీకీ పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) పరీక్షను కామన్‌గా నిర్వహిస్తారు. నవంబరు 7న ఉదయం పేపర్-1 పరీక్ష ఉంటుంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


APPSC CAS Application: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...