TS Govt Jobs : నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 1540 పోస్టుల భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్‌ 14 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చాని వెల్లడించింది.

  


 నోటిఫికేషన్ రద్దు


తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దుచేసింది. అభ్యర్థులకు హెవీ వెహికల్స్ లైసెన్స్‌ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్హతల విషయంలోనూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఆ అభ్యంతరాలను రవాణాశాఖకు తెలియజేసినట్లు వివరించింది. 113 ఏఎంవీ పోస్టుల భర్తీకి జులై 27న నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే.






గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీ


తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా అనుమతించింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


50 వేల ఉద్యోగాలు


తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. 


Also Read : Singareni Jobs 2022: రేపే సింగరేణి ఉద్యోగాలకు ఎగ్జామ్, హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్నారా


Also Read : TSLPRB: కానిస్టేబుల్ కీపై అభ్యంతరాలకు అవకాశం, ఇలా తెలపండి!