విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్‌లో ఏడాది అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతులన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

పోస్టుల వివరాలు:  

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 55     

2) టెక్నీషియన్ డిప్లొమా, అప్రెంటిస్: 49     

విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్. 

అర్హతలు: డిప్లొమా/డిగ్రీ (ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.     

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.     


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది
(NATS పోర్టల్)
21.09.2022
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది
(హిందూస్థాన్ షిప్‌యార్డ్ పోర్టల్)
26.09.2022
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ర్యాంక్ జాబితా వెల్లడి 28.09.2022


Notification

Online Application

 

Also Read:

ITPF: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్ పోర్ట్) గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోస క్లిక్ చేయండి..

Also Read:

UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!

న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..