A.P. Animal Husbandry Subordinate Services: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) వెలువడింది. దీనిద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (Animal Husbandry Assistant) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic), ఇంటర్ ఒకేషనల్ (Inter Vocational) కోర్సు, బీటెక్ (BTech), బీఎస్సీ (BSc), ఎంఎస్సీ(MSc) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20న ప్రారంభంకాగా.. డిసెంబర్ 12 దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులకు డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు. రాతపరీక్షలో ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.
వివరాలు..
* యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టులు
ఖాళీల సంఖ్య: 1896.
జిల్లాలవారీగా ఖాళీలు..
➥ అనంతపురం: 473 పోస్టులు
➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు
➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు
➥ వైఎస్‌ఆర్ కడప: 210 పోస్టులు
➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు
➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు
➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు
➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు
➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు
➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు
➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు
➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు
➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు
అర్హతలు..
➤ యానిమల్ హజ్బెండరీ విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ ఒకేషనల్ (డెయిర్, పౌల్ట్రీ సైన్సెస్)/ రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు / ఇంటర్ వొకేషనల్ (మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్) కోర్సు చేసి ఉండాలి. (లేదా)
➤ ఇంటర్ వొకేషనల్ (డెయిరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ ఓపెన్ ఇంటర్ (డెయిరీ పార్మింగ్ ఒక వొకేషనల్ సబ్జెక్టుతో) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ బీఎస్సీలో డెయిరీ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా)
➤ ఎంఎస్సీ(డెయిరీ సైన్స్) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి డిప్లొమా (వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
➤ శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి డిప్లొమా (డెయిరీ ప్రాసెసింగ్) ఉండాలి. (లేదా)
➤ భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డిప్లామా(వెటర్నరీ సైన్స్) ఉండాలి. (లేదా)
➤ బి.వొకేషనల్ (డెయిరింగ్ & ఏనిమల్ హస్బెండరీ) కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అభ్యర్థులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన 6 నెలల నుంచి పనిచేస్తున్న అభ్యర్థులకు 3 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలలకు 43-53 సంవత్సరాల వరకు, అర్హులైన గోపాలమిత్ర/గోపాలమిత్ర సూపర్‌వైజర్లకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.500.. మిగిలిన అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా.
జీతం: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15,000 ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
➤ దరఖాస్తులు ప్రారంభతేదీ: 20.11.2023.
➤ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.12.2023.
➤ దరఖాస్తులకు చివరితేదీ: 11.12.2023.
➤ హాల్‌టికెట్లు విడుదల తేదీ: 27.12.2023.
➤ పరీక్ష (సీబీటీ) తేది: 31.12.2023.