తెలంగాణలో ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్‌ (సివిల్‌, టెక్నికల్‌) ఉద్యోగాలకు ఫైన‌ల్ ప‌రీక్షలు నిర్వహించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ ప‌రీక్షలకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ (సివిల్) పోస్టుల‌కు ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు, కానిస్టేబుల్ (ఐటీ & సీవో) పోస్టులకు మ‌ధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు రాత‌ప‌రీక్షలు నిర్వహించ‌నున్నారు. 


పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు సూచించారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆల‌స్యమైనా అభ్యర్థుల‌ను ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తించ‌బోమ‌ని స్పష్టం చేశారు. సివిల్‌, టెక్నికల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు రెండింటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్‌‌టికెట్ల మీద తప్పసరిగా పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అతికించాలని, లేదంటే పరీక్షకు అనుమతించబోమని స్పష్టంచేశారు.


🔰 మెయిన్ పరీక్ష విధానం: 


➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.


➨  సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.


➨  ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ హాల్‌టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో ప్రింట్ తీసుకొని దానిపై నిర్ధేశిత స్థానంలో దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి అతికించాలి. కేవలం గమ్‌తోనే అతికించాలి. 


➥ అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు. 


➥ మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు. 


➥ అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్‌టికెట్‌తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకెళ్లాలి.


➥ అభ్యర్థులు సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైస్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్ నోట్స్, ఛార్జ్,రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకురాకూడదు.


➥ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలి. 
 
➥ హ్యాండ్‌ బాగ్స్‌, పౌచ్‌ వంటి వస్తువులను పరీక్ష హాల్‌లోకి తీసుకోకూడదు. 


కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


TGT Posts: తెలంగాణ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర ప్రకటన ఏప్రిల్ 28న అధికారులు విడుదల చేశారు. దీనిద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్జెక్టులవారీగా చూస్తే.. తెలుగు-488, సంస్కృతం-25, ఉర్దూ-120, హిందీ-516, ఇంగ్లిష్-681, మ్యాథమెటిక్స్-741, ఫిజికల్ సైన్స్-431, బయోలాజిక్ సైన్స్-327, జనరల్ స్టడీస్-98, సోషల్ స్టడీస్-579 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..